యాదాద్రికి ఎంఎంటీఎస్
ABN, First Publish Date - 2023-07-10T00:25:22+05:30
హైదరాబా ద్ మహానగరం నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి చెంతకు ఇకనుంచి 40నిమిషాల్లోనే చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి యాదాద్రి రైల్వే స్టేషన్ వరకు ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వస్తే నగరం నుంచి కేవలం 40నుంచి 45నిమిషాల్లోనే భక్తు లు లక్ష్మీనరసింహస్వామివారి చెంతకు చేరుకోనున్నా రు. ప్రస్తుతం రోడ్డు మార్గంలోనే భక్తులు గుట్టకు వస్తున్నారు.
రెండో దశ పనులకు మోక్షం
పూర్తయితే హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు 40నిమిషాలే
వ్యయాన్ని సంపూర్ణంగా కేంద్రమే భరిస్తుందని ప్రకటన
యాదాద్రి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): హైదరాబా ద్ మహానగరం నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి చెంతకు ఇకనుంచి 40నిమిషాల్లోనే చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి యాదాద్రి రైల్వే స్టేషన్ వరకు ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వస్తే నగరం నుంచి కేవలం 40నుంచి 45నిమిషాల్లోనే భక్తు లు లక్ష్మీనరసింహస్వామివారి చెంతకు చేరుకోనున్నా రు. ప్రస్తుతం రోడ్డు మార్గంలోనే భక్తులు గుట్టకు వస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య కారణంగా గం టన్నర పాటు నగరం దాటేందుకు సమయం పడుతోంది. అదేవిధంగా బస్సుల్లో, ప్రైవేట్ వాహనాల్లో అధి క మొత్తం చార్జీ వసూలు చేస్తున్నారు. ఎంఎంటీఎస్ అందుబాటులోకి వస్తే నగరవాసులు ట్రాఫిక్ సమస్య లేకుండా యాదగిరిగుట్టకు చేరుకోవడంతోపాటు ప్ర యాణ ఖర్చు భారీగా తగ్గనుంది. యాదాద్రి రైల్వే స్టేషన్ నుంచి ప్రధానాలయం మూడు నుంచి నాలుగు కి లోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్వేస్టేషన్ నుంచి ఎంఎంటీఎస్ సర్వీసులకు అనుసంధానంగా ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. వీటితో పాటు గుట్టకు చేరుకునేందుకు ఆటోలు అందుబాటులోకి ఉండనున్నాయి.
కేంద్రం చొరవతో ఎంఎంటీఎ్‌సకు మోక్షం
దైవదర్శనానికి వచ్చే భక్తులకు మల్టీ మోడల్ రైల్వే సిస్టం(ఎంఎంటీఎస్) సేవలు కొద్దికాలంలో అందుబాటులోకి రానున్నాయి. ఎంఎంటీఎస్ సేవల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వాటా కింద ఒక్కరూపాయి కూడా నిధులు మంజూరు చేయకపోవడంతో ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఘట్‌కేసర్ నుంచి యాదాద్రిభువనగిరి జిల్లా రాయిగిరి రైల్వేస్టేషన్ వరకు విస్తరించనున్నట్టు, అందుకయ్యే ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించింది. కేంద్రం ప్రకటనతో ఎంఎంటీఎస్ సేవలపై ఆరేళ్లుగా ఉన్న గ్రహణం వీడనుంది. హైదరాబాద్ నగర వాసులకు ఆర్టీసీ బస్సుల మాదిరిగానే రైల్వేశాఖ సబ్‌అర్బన్ సర్వీసులు అందించాలని నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రైల్వేశాఖ ద్వారా (ఎంఎంటీఎస్) సేవలు మొట్టమొదట 2003లో ప్రారంభమయ్యాయి. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ఈ సర్వీసులను ప్రభుత్వాలు పలు ప్రాంతాలకు విస్తరించాయి. తెలంగాణ తిరుపతిగా, అంతర్జాతీయ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొత్తరూపు దిద్దుకుంది. దేశంలోని నారసింహ క్షేత్రాల్లో అత్యంత ప్రాశస్త్యమైన దివ్యక్షేత్రం యాదగిరిగుట్ట సందర్శనకు దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాది మం ది యాత్రికులు వస్తుంటారు. హైదరాబాద్ నగరానికి ప్రపంచ, దేశ నలుమూలల నుంచి విమాన, రైల్వే, రోడ్డు ప్రయాణానికి మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్ నగరానికి కేవలం 50కిలోమీటర్ల దూరంలో తిరుమలస్థాయిలో అభివృద్ధి చెందుతున్న లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మాత్రం ప్రజారవా ణా సదుపాయాలు అంతంతంగానే ఉన్నాయి. కృష్ణరా తి శిలా కట్టడంగా ఖ్యాతిపొందిన యాదగిరిగుట్ట చెం తకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు అభివృద్ధి చేసేందు కు ఎంఎంటీఎస్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. 2015-16లో జాయింట్‌వెంచర్‌గా రైల్వేశాఖకు ప్రతిపాదనలు చేయడంతో కేంద్ర ప్రభు త్వం సానుకూలంగా స్పందించింది. నిర్మాణ వ్యయం లో రెండొంతులు రాష్ట్ర ప్రభుత్వం, ఒక వంతు కేంద్ర ప్రభుత్వం భరించే ప్రాతిపదికన 2016-17 ఆర్థిక సంవత్సరంలో యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ మార్గం మం జూరుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మొత్తం రూ.330కోట్లతో చేపట్టనున్న పనులకు రూ. 274.67కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా, రూ.137.33 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ మేరకు సర్వే, ఇతర అంచనా వ్యయాలను రూపొందించడానికి రూ.20కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఎంఎంటీఎస్ రెండోదశ పనులను పర్యవేక్షిస్తున్న రైల్వే వికాస్ నిగమ్ అందుకు టెండర్లు పిలిచింది. అయితే నిర్మాణ వ్యయంలో సింహభాగం భరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం సర్వే నిధులు మినహా, ఇతరత్రా నిధుల కేటాయింపునకు ముందుకు రాకపోవడం, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం కొరవడటంతో రైల్వే వికాస్ నిగమ్ పిలిచిన టెండర్లను రద్దు చేసుకుంది.
పెరగనున్న అంచనా వ్యయం
యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి వచ్చే యాత్రికుల కు మెరుగైన రవాణా సౌకర్యం కోసం ఘట్కేసర్ నుంచి రాయిగిరి వరకు ఎంఎంటీఎస్ పనులను పొ డిగించేందుకు కేంద్రం తాజాగా అంగీకరించింది. ఎంఎంటీఎస్ సేవలకు సంబంధించిన రూ.330కోట్ల వ్యయాన్ని సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించింది. అయితే 2015-16లో ప్రతిపాదన ల ప్రకారం 33కిలోమీటర్ల ఎంఎంటీఎస్ రైల్వేలైన్ నిర్మాణం,ఇతర వ్యయాలు రూ.330కోట్లుగా అంచనా వేశారు. అయితే ఈ నిర్మాణ పనులు చేపట్టడంలో జాప్యం కారణంగా ప్రాజెక్టు వ్యయం కూడా భారీగా పెరగనుంది. తాజాగా ఘట్కేసర్ నుంచి రాయిగిరి వరకు ఎంఎంటీఎస్ రైల్వే లైన్ నిర్మాణం, భూసేకర ణ, సిగ్నలింగ్ తదితర నిర్వహణ అంచనా వ్యయం రూ.412కోట్ల వరకు అయ్యే అవకాశం ఉందని రైల్వే అధికారులు రీఎస్టిమేట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి, పనులన్నీ సజావుగా నిర్వహిస్తే ఎంఎంటీఎస్ యాదగిరిగుట్ట క్షేత్రానికి అందుబాటులోకి వచ్చందుకు రెండునుంచి మూడేళ్ల కాలం పట్టే అవకాశాలు ఉన్నాయి.
రూ.100కోట్లతో భువనగిరి ఖిల్లా అభివృద్ధి
భువనగిరి టౌన్: యాదాద్రి జిల్లా దీర్ఘకాలికంగా ఊరిస్తున్న చారిత్రక భువనగిరి ఖిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఊరట వచ్చింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని చారిత్రక ప్రదేశాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన స్వదేశి దర్శన్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ భువనగిరి ఖిల్లాను ఎంపిక చేసింది. ఖిల్లాపైకి రోప్‌వే, మ్యూజిక్, లైటింగ్, గ్రీనరీ, రెస్టారెంట్ తదితర అభివృద్ధి పనులకు గత బడ్జెట్‌లో రూ.100కోట్లను కేటాయించింది. ఈ మేరకు ఎల్‌అండ్‌టీ ఇంజనీరింగ్ సంస్థ డీపీఆర్ రూపొందించే పనులను ప్రారంభించింది. దసరా నాటికి టెండర్ దశను దాటుతుందని పర్యాటకశాఖ అధికారులు చెబుతున్నారు. ఖిల్లా అభివృద్ధి పనులు పూర్తయితే ఈ ప్రాంత స్వరూపం మారి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని స్థానికులు భావిస్తున్నారు.
Updated Date - 2023-07-10T00:25:22+05:30 IST