త్వరలో మెడికల్ కళాశాల
ABN, First Publish Date - 2023-02-17T00:50:38+05:30
జిల్లాలో త్వరలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీ్‌షరావు అన్నారు. గురువారం యాదగిరిగుట్టలో రూ.35.95కోట్లతో నిర్మించనున్న వంద పడకల ఆస్పత్రికి భూమి పూజ చేశారు. అనంతరం ఆలేరు నియోజకవర్గస్థాయి బీఆర్‌ఎస్ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వైద్య రంగంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందని, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునే యూపీ చిట్టచివరన 28వ స్థానంలో ఉందన్నారు.
జిల్లాలో ఏర్పాటుకు చర్యలు
భక్తులు, స్థానికులకు మెరుగైన వైద్య సేవలు
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీ్‌షరావు
గుట్టలో వంద పడకల ఆస్పత్రికి భూమిపూజ
యాదగిరిగుట్ట రూరల్, ఫిబ్రవరి 16: జిల్లాలో త్వరలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీ్‌షరావు అన్నారు. గురువారం యాదగిరిగుట్టలో రూ.35.95కోట్లతో నిర్మించనున్న వంద పడకల ఆస్పత్రికి భూమి పూజ చేశారు. అనంతరం ఆలేరు నియోజకవర్గస్థాయి బీఆర్‌ఎస్ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వైద్య రంగంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందని, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునే యూపీ చిట్టచివరన 28వ స్థానంలో ఉందన్నారు. లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొనేందుకు ప్రతిరోజు విచ్చేసే భక్తులకు, స్థానిక ప్రజలకు మెరుగైన వైద్యం అందజేస్తామని, ఆలేరు ఏరియా ఆస్పత్రి మరమ్మతులకు రూ.కోటి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డయాలసిస్ సెంటర్ ఉండేది కాదని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆలేరు, భువనగిరి, మునుగోడు నియోజకవర్గాల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వంద పడకల ఆస్పత్రిని గ్రామ శివారు ప్రాంతంలో కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్డుకు దగ్గరలో ఉండేలా నిర్మించాలని ఆదేశించినట్లు తెలిపారు.
రూ.33 కోట్లను కేంద్రం నిలిపివేసింది
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఉచితంగా 24గంటల కరెంట్ సరఫరా చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెట్టాలని ఆదేశాలు జారీచేసినా పెట్టకపోవడంతో తెలంగాణకు రావాల్సిన రూ.33కోట్లను నిలిపివేశారని హరీ్‌షరావు అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు వేస్తే బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరుతో సచివాలయం అన్ని హంగులతో నిర్మిస్తే ఓ నాయకుడు గుమ్మటాలు తొలగిస్తామని, మరో నాయకుడు పేల్చివేయాలని అంటున్నారన్నారు. వారు కావాలో లేక అభివృద్ధి చేసే నాయకులు కావాలో మీరే ఆలోచించి, రాబోయే ఎన్నికల్లో వారికి తగిన బుద్ధిచెప్పాలన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీ్‌షరావు సహకారంతో ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని హంగులతో అభివృద్ధిచేస్తూ రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపుతానని అన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బి.లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, మదర్‌డెయిరీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, సెక్రెటరీ జనరల్ కసావు శ్రీనివా్‌సగౌడ్, మిట్ట వెంకటయ్యగౌడ్, స్థానిక మునిసిపల్ చైర్‌పర్సన్ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్, ఆలేరు చైర్మన్ శంకరయ్య, పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్, పాపట్ల నరహరి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కాగా, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రాన్ని మంత్రి తన్నీరు హరీ్‌షరావు దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
భూమి పూజ వద్ద నిరసన
యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామ శివారు ప్రాంతంలో సర్వే నెం.329లో 100 పడకల ఆస్పత్రికోసం మంత్రి హరీ్‌షరావు, విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి భూమి పూజ చేసి వెనుదిరిగారు. అయితే ఆస్పత్రి నిర్మించే స్థలం తమదని, వైటీడీఏ అభివృద్ధిలో భాగంగానే తమ భూములు లాక్కున్నారని, ఇంకా పరిహారం కూడా ఇవ్వలేదని భూమి కోల్పోయిన పలువురు నిర్వాసితుల నిరసన వ్యక్తం చేశారు.
Updated Date - 2023-02-17T00:50:39+05:30 IST