కవలలకు ఎంబీబీఎస్‌లో సీట్లు
ABN, First Publish Date - 2023-09-22T00:42:53+05:30
కలలు కన్నారు.. ఆ కవలలు మెడిసిన సీట్లను సంపాదించారు.
ఆలేరు రూరల్, సెప్టెంబరు 21: కలలు కన్నారు.. ఆ కవలలు మెడిసిన సీట్లను సంపాదించారు. మండలంలోని గుండ్లగూడెం గ్రామానికి చెందిన ఆలేటి రాంచందర్ సుమిత్రలకు ముగ్గురు సంతానం వీరిలో ప్రణతి, ప్రణీతలు కవలపిల్లలు.. విద్యావంతులైన తల్లిదండ్రులు ఆర్థిక స్థోమత సరిపోకున్నా.. తమ పిల్లలిద్దరినీ ఉన్నత చదువులు చదివించాలని కలలు కన్నారు. వారి కలలను ఆ కవలలిద్దరూ సాకారం చేయడంతో ఆ కుటుంబంలో ఆనందం నెలకొన్నది. సాయి ప్రణతి గత సంవత్సరం నీట్ రాసి బీడిఎ్‌సను దిల్‌సుక్‌నగర్‌లోని పానినాయ డెంటల్ కళాశాలలో చేస్తుండగా ప్రణీత సూరారంలోని మల్లారెడ్డి డెంటల్ కళాశాలలో బీడిఎస్ చదువుతున్నది. దీంతో సంతృప్తి చెందని ఆ కవలలిద్దరూ తమ ఇంట్లోనే చదువుతూ మే 7, 2023న జరిగిన నీట్ పరీక్షను రాశారు. 13 జూన 2023న నీట్ ఫలితాలు రాగా వీరిద్దరికీ మంచి ఫలితాలు వచ్చాయి. నాలుగు రోజుల క్రితం సాయి ప్రణతికి కామారెడ్డిలోని గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో, ప్రణీతకు మేడ్చల్‌లోని మెడిసిటీ మెడికల్ కళాశాలలో సీట్లు లభించాయి. వీరిద్దరిని గ్రామ సర్పంచ ఏసిరెడ్డి మహేందర్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, గ్రామ పెద్దలు అభినందించారు. ప్రస్తుతం వీరి కుటుంబం హైదరాబాద్‌లోని మేడిపల్లిలో నివాసం ఉంటోంది.
Updated Date - 2023-09-22T00:42:53+05:30 IST