ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మట్టపల్లి క్షేత్రాన్ని రెండో యాదాద్రిగా తీర్చిదిద్దుతా

ABN, First Publish Date - 2023-05-03T00:37:07+05:30

మండలంలోని మట్టపల్లి క్షేత్రాన్ని రెండో యాదాద్రిగా తీర్చిదిద్దుతానని హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

మట్టపల్లి నృసింహుని ఆలయ నూతన పాలకవర్గ సభ్యులతో ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

మఠంపల్లి, మే 2: మండలంలోని మట్టపల్లి క్షేత్రాన్ని రెండో యాదాద్రిగా తీర్చిదిద్దుతానని హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం మట్టపల్లి మహాక్షేత్రంలో జరిగిన దేవాలయ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కోదాడ ఎమ్మెల్యే బొల్లం యాదవ్‌తో సహా హాజరయ్యారు. ముందుగా నృసింహుడిని దర్శించుకున్నారు. ఎమ్మె ల్యేలకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనం తరం ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేసి స్వామి వారి పట్టు శేష వస్త్రా లతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లా డుతూ మట్టపల్లి క్షేత్రాన్ని సకల సౌకర్యాలు హంగులతో అద్భుతమైన ఆలయంగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఆలయాల అభి వృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. నూతన ప్రమాణ స్వీకారం చేసిన ఆలయ పాలక వర్గ సభ్యులు దేవాలయం అభివృద్ధికి సమ ష్టిగా పనిచేయాలన్నారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ మాట్లాడుతూ మట్టపల్లి శ్రీలక్ష్మీ నరసింహుని ఆశీస్సులతో కోదాడ, హుజూర్‌ నగర్‌ నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరివిజయ్‌కుమార్‌, మట్టపల్లిరావు దేవాదాయ ధర్మదాయ జిల్లా అధికారులు ఈ.రమేష్‌, ఈవోలు నవీన, లక్ష్మణ రావు, ఎంపీపీ ముడావత పార్వతికొండానాయక్‌, జడ్పీటీసీ సైదిరెడ్డి, సర్పంచ దాసరి విజయలక్ష్మీవెంకటరమణ, ఎంపీటీసీ వెంకటరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారం చేసిన ఆలయ పాలకవర్గం

మట్టపల్లి దేవస్థాన నూతన పాలకవర్గ సభ్యులుగా ఎంపికైన 14మంది సభ్యులను దేవాదాయ శాఖ అధికా రుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. దేవ స్థాన నూతన పాలకవర్గ సభ్యులు కె.వెంకటనారాయణ, కె.రామయ్య, ఎస్‌.ఫణికుమార్‌, గుండా కొండల్‌రెడ్డి, చల్లా ప్రకాష్‌రావు, వై.కామేశ్వరమ్మ, మన్నెం శేషిరెడ్డి, బానోతు అలీ, చిలక రామకృష్ణ, పాశ్యం శ్రీనివాస్‌రెడ్డి, గోలి శ్రీనివాస్‌, పి.నర్సింహ, కండే వెంకటేశ్వర్లు, సీహెచ విజయ్‌కుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరి విజయ్‌కుమార్‌, మట్టపలి ్లరావు దేవాదాయ ధర్మదాయ జిల్లా అధికారులు ఈ.రమేష్‌, ఈవోలు నవీన, లక్ష్మణారావు, ఎంపీపీ ముడావత పార్వతి కొండానాయక్‌, జడ్పీటీసీ సైదిరెడ్డి, సర్పంచ దాసరి విజయలక్ష్మీవెంకటరమణ, ఎంపీటీసీ వెంకటరెడ్డి, ఆలయ ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-03T00:37:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising