‘కంటి వెలుగు’ను సద్వినియోగం చేసుకోవాలి
ABN, First Publish Date - 2023-01-18T00:51:14+05:30
కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కోటా చలం అన్నారు. మంగళవారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
డీఎంహెచ్‌వో కోటా చలం
నేటి నుంచి రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమం
ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్: ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కోటా చలం అన్నారు. మంగళవారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో కంటి వెలుగుకు సంబంధించిన కరపత్రాలు, మందులు, ఏఆర్ మిషన్ పని తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి కంటి వెలుగు కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన వారందరూ కళ్లను పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అసంక్ర మిత వ్యాధుల అధికారి కల్యాణ్‌చక్రవర్తి, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి వేణుగోపాల్, వైద్యులు విజయ్, వీరేందర్, యాతాకుల మధుబాబు, సురేంద్ర పాల్గొన్నారు.
కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించిన డీఎంహెచ్‌వో, ఆర్డీవో
హుజూర్‌నగర్ మండలం అమరవరం గ్రామంలో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆర్డీవో వెంకారెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో నిరంజన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీలో మౌలిక వసతులు ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, అంజిరెడ్డి, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, ఎంపీవో మౌలానా, తహసీల్దార్ దామోదర్, శ్రీనివాస్, ప్రభాకర్, ఇందిరాల రామకృష్ణ, అంజయ్య, విజయ పాల్గొన్నారు.
లు కోరారు.
Updated Date - 2023-01-18T00:51:18+05:30 IST