ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అభ్యర్థుల ప్రకటనతో శ్రేణుల సంబురాలు

ABN, First Publish Date - 2023-08-22T00:43:47+05:30

అసెంబ్లీ ఎన్నికలకు సీఎం కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి.

సూర్యాపేటలో సంబురాల్లో మంత్రి జగదీష్‌రెడ్డి

అసెంబ్లీ ఎన్నికలకు సీఎం కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యేలకే మరోసారి అవకాశం ఇవ్వడంతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. మధ్యాహ్నం నుంచి బాణా సంచా కాల్చడంతో పాటు మిఠాయిలు పంపిణీ చేశారు. కొన్నిచోట్ల ర్యాలీలు నిర్వహిం చారు. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

తిరుమలగిరి : మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గాదరి కిషోర్‌కుమార్‌ను ప్రకటించడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. తిరుమలగిరి మండల కేంద్రంలో పెద్దఎత్తున బాణాసంచా కాల్చి, హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు.

మద్దిరాల:మద్దిరాల మండలకేంద్రంలో బాణా సంచాకాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్‌ ఎస్‌ఏ రజాక్‌, నాయకులు బెజ్జంకి శ్రీరాంరెడ్డి, దుగ్యాల రవీందర్‌రావు, విష్ణు వర్దన్‌రెడ్డి, ఆకుల ఉప్పలయ్య, గుడ్ల వెంకన్న, మారెల్లి యాకయ్య, దామెర్ల వెంకన్న, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.

అర్వపల్లి : అర్వపల్లిలో జరిగిన సంబురాల్లో జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గుండగాని సోమే్‌షగౌడ్‌, సర్పంచ బైరబోయిన సునితరామలింగయ్య, మన్నె లక్ష్మినర్సయ్యయాదవ్‌, కనుకు శ్రీనివాస్‌, విద్యాసాగర్‌, యుగేంధర్‌, శ్రీనివాస్‌, శైలందర్‌, రాజు, సంతు పాల్గొన్నారు.

తుంగతుర్తి : తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి. ఈ సందర్భంగా కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, సింగిల్‌విండో చైర్మన గుడిపాటి సైదులు, కటకం వెంకటేశ్వర్లు, దొంగరి శ్రీనివాస్‌, గోపగోని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

చిలుకూరు: కోదాడ ఎమ్మెల్యేగా బొల్లం మల్లయ్యయాదవ్‌కు టికెట్‌ కేటాయించడంపై బీఆర్‌ఎస్‌ మం డల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రమణ నాగయ్య, సొసైటీ చైర్మన అల్సకాని జనార్ధన, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దొడ్డా సురేష్‌, మాజీ ఎంపీపీ కొండా అన్నపూర్ణ, కస్తూరి సైదులు, నాగేశ్వరరావు, ఎస్‌కె పాషా, బెల్లంకొండ సైదులు, శ్రీను, లింగరాజు, వీరబాబు, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

మోతె : కోదాడ అభ్యర్థిగా మల్లయ్యయాదవ్‌ని ప్రకటించడంతో మండలంలోని రాఘవాపురం క్రాస్‌రోడ్‌, మామిళ్లగూడెం, కూడలి, హుస్సేనాబాద, రావిపహడ్‌ గ్రామాల్లో సంబురాలు నిర్వహించారు. మల్లయ్యను ఎమ్మెల్యేగా గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శీలం సైదులు, నాయకులు వెంకటేశ్వరరావు, మద్ది మధుసూదనరెడ్డి, మధు, వెంకటేశ్వరావు, కాంపాటి వెంకన్న, సోమేష్‌, నవిలే రామకోటయ్య పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని కూడలి గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ కేక్‌కట్‌ చేసి మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు, నాయకులు ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు.

హుజూర్‌నగర్‌:హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డిని ప్రకటించడంతో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు సంబురాలు చేసుకున్నారు. పట్టణంలోని ఇందిరాసెంటర్‌లో బాణా సంచాకాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చిట్యాల అమర్‌నాథ్‌రెడ్డి, బెల్లంకొండ అమర్‌గౌడ్‌, హరిబాబుచౌదరి, కిరణ్‌కుమార్‌, ఫణికుమారి, విజయ్‌, పద్మారెడ్డి, కవిత, దీప, కొమ్ము శ్రీను, శంభయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T00:43:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising