ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కార్మికుల హక్కుల కోసం పోరాడదాం

ABN, First Publish Date - 2023-08-02T00:19:28+05:30

కార్మికుల హక్కుల కోసం పోరాడదామని ఇఫ్ట్యూ జిల్లా సహాయ కార్యదర్శి తురక శ్రీను అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న తురక శ్రీను

గరిడేపల్లి, ఆగస్టు 1: కార్మికుల హక్కుల కోసం పోరాడదామని ఇఫ్ట్యూ జిల్లా సహాయ కార్యదర్శి తురక శ్రీను అన్నారు. మంగళవారం మండలంలోని గడ్డిపల్లిలో నిర్వహించిన ఇఫ్ట్యూ మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను వ్యతిరేకిస్తూ కార్మికులు పోరాటం చేయాలన్నారు. మోదీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేస్తూ కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముగాస్తోందన్నారు. హమాలీలకు పని భద్రత, ప్రమాదబీమా కల్పించాలని డిమాండ్‌ చేశారు. భవన నిర్మాణ కార్మికులు క్లైమ్‌ల దరఖాస్తులను ఎనిమిది నెలల క్రితం అందజేసినా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ఈ నెల తొమ్మిదో తేదీన నిర్వహించే ధర్నానలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పిట్టల అంజయ్య, నరేష్‌, చినలింగయ్య, పెదలింగయ్య, సుందరయ్య, ఏడుకొండలు, సైదులు, పిచ్చయ్య, వెంకటేశ్వర్లు, ఎల్లయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T00:19:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising