ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7న ‘నల్లగొండ యువతరం’ యాప్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2023-05-03T00:05:01+05:30

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల సౌకర్యార్థం నల్లగొండ యువతరం యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ చైర్మన గుత్తా అమితరెడ్డి తెలిపారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న గుత్తా అమితరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ టౌన / కనగల్‌, మే 2: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల సౌకర్యార్థం నల్లగొండ యువతరం యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ చైర్మన గుత్తా అమితరెడ్డి తెలిపారు. ఈ నెల 7న టీఎనజీవో్‌స భవనంలో నిర్వహించే ప్రారంభోత్సవానికి నిరుద్యోగులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు. మంగళవారం మండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు రెండు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉచిత భోజనవసతితో పాటు శిక్షణను విజయవంతంగా నిర్వహించామన్నారు. శిక్షణ కార్యక్రమాలను విస్తరించాలన్న సూచనలు, సలహాలురావడంతో చక్రవర్తి ఈ-లెర్నింగ్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. సమావేశంలో నాయకులు మునాసు వెంకన్న, దుబ్బ అశోక్‌సుందర్‌, శ్రీనివా్‌సగౌడ్‌, హన్ను పాల్గొన్నారు. అదేవిధంగా కనగల్‌ మండలం దర్వేశీపురం రేణుకాఎల్లమ్మ ఆలయంలో గుత్తా అమితరెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ నాయకులు ఐతగోని స్వామి, రామలచ్చయ్య, కేశవరెడ్డి, వనం వెంకటేశ్వర్లు, కంచరకుంట్ల గోపాల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మండలి పరమేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-05-03T00:05:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising