కోదాడ ప్రభుత్వ వైద్యశాల100పడకలుగా అప్‌గ్రేడ్
ABN, First Publish Date - 2023-07-12T01:54:05+05:30
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కోదాడ పట్టణ ప్రజల కల సాకారమైంది. కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిని 100పడకలుగా అప్‌గ్రేడ్ చేయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ సీఎం క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్‌ను మంగళవారం కలిసి విజ్ఞప్తి చేశారుKodada Government Hospital upgraded to 100 beds
కోదాడ, జూలై 11: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కోదాడ పట్టణ ప్రజల కల సాకారమైంది. కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిని 100పడకలుగా అప్‌గ్రేడ్ చేయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ సీఎం క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్‌ను మంగళవారం కలిసి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వినతి మేరకు కోదాడ ప్రభుత్వ వైద్యశాలను 100పడకలుగా అప్‌గ్రేడ్ చేస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. కోదాడ నియో జకవర్గ అభివృద్ధికి రూ.100కోట్లు నిధులు మంజూరు చేయాలని కోరగా సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిని 100పడకలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ఆదేశాల జారీ చేయ డంపై సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
- కోదాడ మునిసిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని పురపా లక శాఖ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ఎను ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ కోరారు. కోదాడ పెద్దచెరువును మినీట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేయడానికి, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు, మిషన భగీరథ పైపులైన్ల కోసం, రోడ్డ మరమ్మతు, అంతర్గత సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనికి మంత్రి సానుకూ లంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.
మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్‌నగర్: ఐటీ మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కలిశారు. నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రికి ఎమ్మెల్యే వివరించారు.
ర్, సాయిలు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-12T01:54:05+05:30 IST