కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
ABN, First Publish Date - 2023-05-13T23:29:45+05:30
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడంతో జిల్లావ్యాప్తంగా ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో గెలవడంతో జిల్లా వ్యాప్తంగా సంబరాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడంతో జిల్లావ్యాప్తంగా ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. బాణా సంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ప్రధాన పట్టణాలైన సూర్యాపేట, హుజూర్‌నగర్, కోదాడ, నేరేడుచర్లలో పార్టీ శ్రేణులు ర్యాలీలు నిర్వహించాయి. కర్ణాటక స్ఫూర్తితో డిసెంబరులో తెలం గాణలో జరిగే శాసనసభ ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుం టుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-05-13T23:29:45+05:30 IST