దేశాన్ని గౌరవించడం అందరి బాధ్యత
ABN, First Publish Date - 2023-08-15T00:07:24+05:30
జీవించడానికి సదుపాయాలతోపాటు హక్కులు కల్పిస్తున్న దేశాన్ని గౌరవించడం అందరి బాధ్యత అని ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే. మారుతీదే వి అన్నారు.
ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మారుతీదేవి
భువనగిరి టౌన్, ఆగస్టు 14: జీవించడానికి సదుపాయాలతోపాటు హక్కులు కల్పిస్తున్న దేశాన్ని గౌరవించడం అందరి బాధ్యత అని ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే. మారుతీదే వి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ, భువనగిరి న్యాయవాదుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి నిర్వహించిన దేశ భక్తి పాటల పోటీలు, రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, విధులు అంశంపై నిర్వహించిన సదస్సులో మా ట్లాడారు. ప్రజల భద్రత, న్యాయం జరిగేందుకు కోర్టు వ్యవస్థ కీలకమన్నారు. ఇందుకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలన్నారు. సీనియర్ సివిల్ జడ్జి కె. మురళీమోహన్, న్యాయవాదుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు నాగారం అంజయ్య, రాజశేఖర్‌రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయుడు బి. సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-15T00:07:24+05:30 IST