ప్రతిపక్షాలకు అధికారమిస్తే పథకాలు గల్లంతే
ABN, First Publish Date - 2023-08-02T00:46:48+05:30
ప్రతిపక్షాల మాటలు నమ్మి వారికి అధికారమిస్తే సంక్షే మ పథకాలు గల్లంతవుతాయని జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమ ర్తి లింగయ్య అన్నారు. రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి బంగారు పంట లు పండిస్తుంటే, 3గంటల విద్యుత్ చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు.
జడ్పీ చైర్మన్ బండా, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నార్కట్‌పల్లి,ఆగస్టు 1: ప్రతిపక్షాల మాటలు నమ్మి వారికి అధికారమిస్తే సంక్షే మ పథకాలు గల్లంతవుతాయని జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమ ర్తి లింగయ్య అన్నారు. రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి బంగారు పంట లు పండిస్తుంటే, 3గంటల విద్యుత్ చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. మంగళవారం మండలంలోని వివిధ గ్రామాల కు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ కింద మంజూరైన ఆర్థిక సా యం చెక్కులను రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలను గతంలో పాలించిన పార్టీలు, ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వలేదో ప్రశ్నించాలన్నారు. మంచి పను లు చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి అండగా నిలవాలో లేదో ప్రజలు గ్రామాల్లో చర్చపె ట్టి ఆలోచించాలన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రతిపక్షాలు మాయమాట లు చెబుతున్నాయని, వాటిని నమ్మి మోసపోతే గోసపడతారన్నారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు దుబ్బాక పావని, వాజిద్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు యా నాల అశోక్‌రెడ్డి, బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, బద్దం రాంరెడ్డి, రేగట్టె నారాయణరెడ్డి, మేడి శంకర్,మాదగోని నర్సింహ్మ, డిప్యూటీ కలెక్టర్ పులి సైదులు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-02T00:46:48+05:30 IST