గ్రూప్-1 పరీక్ష సజావుగా నిర్వహించాలి
ABN, First Publish Date - 2023-06-11T01:21:03+05:30
జిల్లాలో ఆదివారం గ్రూప్-1 పరీక్షను సజా వుగా నిర్వహించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్. వెంక ట్రావ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై ఎస్పీ రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్‌తో కలెక్టరేట్‌లో శనివారం కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సూర్యాపేట(కలెక్టరేట్), జూన్ 10: జిల్లాలో ఆదివారం గ్రూప్-1 పరీక్షను సజా వుగా నిర్వహించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్. వెంక ట్రావ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై ఎస్పీ రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్‌తో కలెక్టరేట్‌లో శనివారం కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో దివ్యాంగుల కో సం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. స్ర్టాంగ్ రూంనుంచి పరీక్షా కేంద్రాలకు పరీక్ష సామగ్రిని తరలించడంలో అప్రమత్తంగా ఉండాల న్నారు. జిల్లా కేంద్రంలో 32కేంద్రాల్లో 9170మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 10.15గంటల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించవద్దన్నారు. పరీక్షా కేంద్రంలోని ఎలక్ర్టానిక్ వాచ్‌లు, సెల్‌ఫోన్లు ఇతర వస్తువులు అనుమతించవద్ద న్నారు.అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డులను వెంట తీసుకురావాలని సూచించారు. టీఎ్‌సపీఎస్సీ నిబంధనల మేరకు పరీక్ష నిర్వహించాలన్నారు. పోలీ సులు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఎస్పీలు పరిక నాగభూషణం, జి.రవి, ఏవో శ్రీదేవి పాల్గొన్నారు.
Updated Date - 2023-06-11T01:21:03+05:30 IST