ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో తాతామనుమడు మృతి

ABN, First Publish Date - 2023-02-21T00:31:09+05:30

సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వరుసకు తాత, మనుమడు మృతి చెం దారు. రామాంజనేయతండాకు లకావత చిన్న బాలు(50) వ్యవసాయం చేస్తూ జీవిస్తుంటాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

చిన్నబాలు, గోపీచంద్‌(ఫైల్‌ఫొటోలు)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోదాడ రూరల్‌, ఫిబ్రవరి 20 : సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వరుసకు తాత, మనుమడు మృతి చెం దారు. రామాంజనేయతండాకు లకావత చిన్న బాలు(50) వ్యవసాయం చేస్తూ జీవిస్తుంటాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పొలానికి నీళ్లు పెట్టేందుకు సోమవారం గ్రామా నికి చెందిన వరుసకు మనుమడైన లకావత గోపీచంద్‌(14)తో కలిసి ద్విచక్ర వాహనంపై దొండపాడు వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో ఎదు రుగా దొండపాడు నుంచి కోదాడ వైపు వస్తున్న సిమెంట్‌ లారీ ఢీకొట్టింది. దీంతో చిన్నబాలు అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలైన లకావత గోపీచంద్‌ను కోదాడ ప్రభుత్వఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మనుమడు కూడా మృతిచెందాడు. చిన్నబాలు భార్య రజిత ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాయిప్రశాంత తెలిపారు.

Updated Date - 2023-02-21T00:31:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising