ఘనంగా శ్రీనివాస్‌గౌడ్ జన్మదిన వేడుకలు
ABN, First Publish Date - 2023-05-19T00:37:47+05:30
బీజేపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్‌గౌడ్ 52వ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.
రామగిరి, మే 18 : బీజేపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్‌గౌడ్ 52వ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మంగారి గుట్టపై ఉన్న కనకదుర్గ ఆలయంలో శివలింగానికి అభిషేకం, ప్రత్యేకపూజలు చేశారు. అక్కడే ఉన్న వేదపాఠశాలకు నిత్యావసరాలు అందజేశారు. అనంతరం లైనవాడ వద్ద దళితమోర్చ అధ్యక్షుడు గాలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం, ఎంజీ యునివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో క్లాక్‌టవర్ సెంటర్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించారు. యునివర్సీటి విద్యార్థులు భారీ గజమాలతో ఆయన్ను సత్కరించారు. మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం తన నివాస గృహంలో నాయకులు, కార్యకర్తల సమక్షంలో శ్రీనివాస్‌గౌడ్ కేక్‌ను కట్ చేసి సంబురాలు నిర్వహించుకున్నారు. అనంతరం పట్టణంలో కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కాగా ఆయా కార్యక్రమాల్లో నాయకులు పోతేపాక సాంబయ్య, యూసుఫ్, నేవర్స్ నీరజ, రావెళ్ల కాశమ్మ, ఏపూరి దయాకర్, ఒంగూరి రాఖీ, ఏడుకొండ హరి, ఆవుల మధు, బలరాం, బాలాజీ, భరత, ఎండీ అఫ్రోజ్, శ్యాంప్రసాద్, నరేష్ తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-05-19T00:37:47+05:30 IST