ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రభుత్వ హాస్టళ్లు వెలవెల

ABN, First Publish Date - 2023-06-26T01:23:40+05:30

ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులు చేరడానికి ఆడ్మి షన్లను ఆహ్వానిస్తున్నారు.

సూర్యాపేటలో ప్రభుత్వ హాస్టల్‌ భవన సముదాయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులు చేరడానికి ఆడ్మి షన్లను ఆహ్వానిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి కళాశాల విద్యార్థుల వరకు హాస్టళ్లలో ప్రవేశం పొందే అవకాశం ఉంది. ఈ నెల 30 వరకు ఆడ్మిషన్లు తీసుకోవచ్చు. గతంలో ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో నేరుగా వెళ్లి వార్డెన్లకు దరఖాస్తు ఇస్తే వారే వసతి ఏర్పాటు చేస్తారు. ఇలా కాకుండా బీసీ హాస్టళ్లలో విద్యార్థులు చేరడానికి కొత్తగా ఆనలైనలో దరఖాస్తు చేసుకోవాలి. ఆనలైన దర ఖాస్తు ద్వారా సీటు పొందితే హాస్టల్‌ను కేటాయించాలని కొత్త నిబంధన వచ్చింది. ఎస్టీ హాస్టళ్లకు కొత్తగా 500 మంది విద్యార్థులు ఆడ్మిషన్లు పొంది నట్లు అధికారులు చెబుతున్నారు. ఎస్సీ హాస్టళ్లలో ఇంకా ఎవరూ చేరలేదని జిల్లా అధికారులు చెబుతున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు రెన్యూవల్‌ (పాత)వారిని తీసుకుంటామని చెబుతున్నారు. ఈ నెల 12వ తేదీన నుంచి పాఠశాలలు పున:ప్రారంభించినా ఇప్పటివరకు నాలుగో వంతు విద్యార్థులైనా హాస్టళ్లకు రాలేదని తెలుస్తోంది. దీనికి తోడు కొత్త ఆడ్మిషన్లు రావడం కష్టంగా మారింది. పాత విద్యార్థులు కూడా హాస్లళ్లకు రాలేదు. . వీరంతా వచ్చిన తర్వాతనే హాస్టళ్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో స్పష్టం చేస్తామని జిల్లా అధి కారులు చెబుతున్నారు. నాణ్యమైన భోజనంతో పాటు అన్ని సౌకర్యాలు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు ఉన్నాయి. ప్రభుత్వం ఎంతో వ్యయప్ర యాసలతో విద్యార్థుల కోసం ప్రభుత్వ హాస్టళ్లను నడిపిస్తున్నాయి. హాస్టళ్లలో చేరే విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, నోట్‌ బుక్‌లు, పెన్నులు, కార్పెట్లు, గిన్నె, పళ్లెం, ఒకొక్కరికి నాలుగు జతల దుస్తులు, సబ్బులు, పాకెట్‌ మనీ సమకూర్చుతున్నాయి. అయినా హాస్టళ్లలో ఉండి చదువుకోవడానికి విద్యా ర్థులు ముందుకు రావడంలేదని వార్డెన్లు చెబుతున్నారు.

అందుబాటులో ఉండని వార్డెన్లు

జిల్లాలో వార్డెన్ల కొరత ఉంది. అయితే ఒక్కో వార్డెనకు రెండు నుంచి మూడు హాస్టళ్లకు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇనచార్జులు ఉన్నందున అంత శ్రద్ధ చూపలేకపోతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల తల్లిదండ్రులువచ్చి తిరిగి వెళుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

జిల్లాలో హాస్టళ్లు ఇలా..

జిల్లాలో ఎస్సీ హాస్టళ్లు 39, ఎస్‌టీ హాస్టళ్లు 21, బీసీ హాస్టళ్లు 25 ఉన్నాయి. 85 సంక్షేమ హాస్టళ్లలో 37 మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీసీ హాస్టళ్లలో 8,220 మంది, ఎస్సీ హాస్టళ్లలో 1,829 మంది, ఎస్టీ హాస్టల్లో 3,500 మంది ఉండగా, బీసీ హాస్టళ్లలో 2,484 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే 2023-24ఆర్థిక సంవత్సరంలో కొత్త విద్యా ర్థులు ఎంత మంది చేరారో ఇంకా తెలియదని ఎస్సీ, బీసీ హాస్టళ్ల జిల్లా అధికారులు చెబుతున్నారు. ఎస్టీ హాస్టళ్లకు 500 మంది విద్యార్థులు కొత్తగా చేరారని గిరిజ సంక్షేమ అధికారి తెలిపారు.

39 హాస్టళ్లలో రెన్యూవల్స్‌ అవుతున్నాయి

జిల్లాలో రెన్యూవల్స్‌ మాత్రమే జరుగుతున్నాయి. జూన 30 తర్వాతనే కొత్తగా ఎంత మంది విద్యార్థులు హాస్టళ్లకు వస్తారో తెలుస్తుంది. పాత విద్యార్థులే ఇంకా హాస్టళ్లకు రావడం లేదు.

- దయానంద్‌రాణి, జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి, సూర్యాపేట

------------------------------------------------------

ఆనలైనలో దరఖాస్తులు చేసుకుంటున్నారు

జిల్లాలో బీసీ హాస్టళ్లలో సీటు కోసం ఆనలైనలో దరఖాస్తు చేసుకుంటు న్నారు. ఇంకా ఆనలైన దరఖాస్తులు తీసుకుంటున్నాం. జూన 30 తర్వాతనే తెలుస్తోంది.

-ఎస్తేర్‌, బీసీ సంక్షేమాఽధికారి, సూర్యాపేట ఇనచార్జి

Updated Date - 2023-06-26T01:23:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising