గ్రామాల్లో వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి
ABN, First Publish Date - 2023-03-02T01:05:10+05:30
గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
దేవరకొండ, మార్చి 1: గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మండలం మంగలోనిబావి గ్రామంలో ‘మన ఊరు, మన ప్రభుత్వం, మన పథకాలు’ కార్యక్రమంలో భాగంగా రూ.33లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. మిషన్‌భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మారేపాకల అరుణ సురేష్‌గౌడ్, వైస్‌ఎంపీపీ చింతపల్లి సుభాష్‌గౌడ్, టీవీఎన్‌రెడ్డి, సర్పంచ్ నిర్మల పార్వతయ్య, నేనావత్ శీనునాయక్ ఉన్నారు.
ఆడపడుచులకు కల్యాణలక్ష్మి పథకం వరం : ఎమ్మెల్యే భగత్
మాడ్గులపల్లి : పేదింటి ఆడపడుచుల వివాహం సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వరంలాంటివని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మండలంలోని మాచనపల్లి, అభంగా పురం, కేశవాపురం గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. అనంతరం మాచనపల్లిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు రొయ్యల సైదులు, సర్పంచ్‌లు పద్మ, మహేశ్వరి, వెంకన్న, యాదగిరిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, గంగాధర్, మార్కెట్ డైరెక్టర్ ఖాసీం, ఎంపీడీవో జితేందర్‌రెడ్డి, ఆర్‌ఐ అక్తర్‌అలీ పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : ఎమ్మెల్యే కిషోర్
శాలిగౌరారం: బీఆర్‌ఎస్ బలోపేతానికి కృషిచేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ పిలుపునిచ్చారు. మండలంలోని చిత్తలూరు గ్రామానికి చెందిన 15మంది కార్యకర్తలు వివిధ పార్టీల నుంచి రాజీనామా చేసి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు అయితగోని వెంకన్నగౌడ్, చాడ హతీష్‌రెడ్డి, దాసరి వెంకన్న, సోమ రమేష్ పాల్గొన్నారు.
కేసీఆర్ పాలన కోరుకుంటున్న దేశ ప్రజలు : ఎమ్మెల్యే చిరుమర్తి
నకిరేకల్: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి సీఎం కేసీఆర్ పాలనను దేశ ప్రజలు కొరుకుంటున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని మంగళపల్లిలో రూ.45లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి శంకుస్థాపన చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. మండలంలోని మండలాపురం గ్రామానికి చెందిన ఆయా పార్టీలకు చెందిన 50మంది యువకులు, ఉపసర్పంచ్ తీగల మహేష్‌తో పాటు పలువురు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీటీసీ మాద ధనలక్ష్మి నగేష్, మంగళపల్లి సర్పంచ్ ప్రగడపు నవీన్‌రావు, మురారిశెట్టి కృష్ణమూర్తి, పెండెం సదానందం, పల్లె విజయ్, దైద పరమేశం, యల్లపురెడ్డి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే కంచర్ల
కనగల్: ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని జీఎడవల్లి గ్రామం లో సీతారామచంద్రస్వామి ఆలయ నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణానికి రూ.26లక్షలు సమకూరుస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకటేశంగౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు సహాదేవరెడ్డి, శ్రీనివాస్, ఐతగోని యాదయ్యగౌడ్, సర్పంచులు పులకరం యాదమ్మ మారయ్య, క్రిష్ణయ్య, శివయ్య, ఎంపీటీసీలు పద్మజగత్, జగాల్, ఎర్రబెల్లి నర్సిరెడ్డి, అల్గుబెల్లి నర్సిరెడ్డి, నల్లబోతు యాదగిరి, వెంకటేశం పాల్గొన్నారు.
Updated Date - 2023-03-02T01:05:10+05:30 IST