వానరానికి అంత్యక్రియలు
ABN, First Publish Date - 2023-09-22T00:44:41+05:30
మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఓ వానరం ప్రమాదవశాత్తు గాయపడి మృతిచెందింది.
గరిడేపల్లి, సెప్టెంబరు 21: మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఓ వానరం ప్రమాదవశాత్తు గాయపడి మృతిచెందింది. ఆ కళేబరాన్ని కుక్కలు లాక్కెళుతుండగా గమనించిన స్థానికుడు నెమ్మాది వెంకన్న గ్రామ యువకులకు సమాచారం అందించాడు. యువకులు మేడిపల్లి పురుషోత్తం, కొలిపాక జగదీష్, రాజలింగం, పంచాయతీ సిబ్బంది కలిసి వానరానికి పూజలు చేసి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటారు.
మఠంపల్లిలో ఆంబోతుకు..
మఠంపల్లి: మఠంపల్లి గ్రామంలో అనారోగ్యంతో అంబోతు గురువారం మృతి చెందింది. గ్రామస్థులు ఆంబోతు కళేబరాన్ని ట్రాక్టర్ ట్రాలీపై ఉంచి పసుపు, కుంకుమాలు, పూలతో ప్రత్యేక పూజలు చేసి అంతిమయాత్ర నిర్వహించి గ్రామశివారులో ఖననం చేశారు.
Updated Date - 2023-09-22T00:44:41+05:30 IST