గ్యాస్ సిలిండర్ లీకై వ్యాపించిన మంటలు
ABN, First Publish Date - 2023-04-03T00:41:08+05:30
గ్యాస్ సిలిండర్ లీకై నగదు, సామగ్రి దగ్ధమయ్యాయి.
రూ.20వేల నగదు , 50 కిలోల బియ్యం దగ్ధం
మద్దిరాల, ఏప్రిల్ 2: గ్యాస్ సిలిండర్ లీకై నగదు, సామగ్రి దగ్ధమయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం కుక్కడం గ్రామంలో వెన్నమళ్ల మల్సూర్ అనే వృద్ధుడు పెంకుటింట్లో నివసిస్తున్నాడు. శనివారం రాత్రి ఇంట్లో సిలిండర్ నుంచి గ్యాస్ లీకైంది. ఉదయం టీకోసం స్టవ్‌ను వెలిగించగా మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లో ఉన్న రూ.20వేలు, రూ.2500విలువైన 50కిలోల బియ్యం దగ్ధమయ్యాయి. గ్యాస్ సిలిండర్ పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
Updated Date - 2023-04-03T00:41:08+05:30 IST