ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వలస కూలీలకు ఉపాధి

ABN, First Publish Date - 2023-08-02T00:16:42+05:30

గతంలో సీజనలో తగిన పనులు లేక స్థానిక కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. దీనికి భిన్నంగా ఇతర రాషా్ట్రల కూలీల మండలానికి వలస రావడం మారిన పరిస్థితికి అద్దం పడుతోంది.

తుంగతుర్తిలో వరి నాట్లు వేయడానికి వచ్చిన ఉత్తరాఖండ్‌ కూలీలు

తుంగతుర్తి, ఆగస్టు 1: గతంలో సీజనలో తగిన పనులు లేక స్థానిక కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. దీనికి భిన్నంగా ఇతర రాషా్ట్రల కూలీల మండలానికి వలస రావడం మారిన పరిస్థితికి అద్దం పడుతోంది. మండలంలో శ్రీ రాంసాగర్‌ కాల్వల ద్వారా నీరు రావడంతో రైతులు ఆరుతడి పంటల కు బదులుగా వరిని సాగు చేస్తున్నారు. దీంతో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గతంలో మండలం నుంచి కూలీలు ఇతర రాషా్ట్రలకు వలస వెళ్లి వరి నా ట్లు వేసేవారు. ప్రస్తుతం మండలంలో కూలీల కొరత ఉండటం, ఉన్న కూలీలకు ఎక్కువ కూలి చెల్లించాల్సి రావడంతో ఇతర రాషా్ట్రలకు చెందిన కూలీలపై రైతులు ఆధారపడుతున్నారు. మండలానికి ప్రస్తుతం ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ, బీహార్‌ రాషా్ట్రనికి చెందిన 60మంది కూలీలు వలస వచ్చి వరి నాట్లు వేస్తున్నారు. తక్కువ ఖర్చుతో వేగంగా శాస్త్రీయ పద్ధతిలో నాట్లు వేయడం వలస కూలీల ప్రత్యేకత. స్థానిక కూలీలతో ఎకరానికి వరి నాట్లు వేయించాలంటే నారు పీకడం, కూలీలకు పంచడం, నాటడం వంటి పనులకు రూ.7 వేల వరకు ఖర్చువుతోందని, వలస కూలీలు అన్ని పనులకు ఎకరానికి రూ.5వేలతో చేస్తున్నారని స్థానిక రైతులు తెలిపారు. వలస కూలీలు తాడుతో కొలతలు తీస్తూ చేలో నడవడానికి బాటలు తీస్తూ శాసి్త్రీయ పద్ధతిలో నాట్లు వేస్తున్నారని, 20 మంది కూలీలు రోజుకు ఆరు నుంచి ఏడెకరాల్లో నాట్లు వే స్తున్నారని రైతులు తెలిపారు. స్థానిక కూలీలు రోజుకు నాలు గు ఎకరాల్లో మాత్రమే నాట్లు వేస్తారన్నారు. వలస కూలీలు శాస్త్రీయమైన బాట పద్ధతిలో నాట్లు వేస్తున్నందున అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. తక్కువ కూలితో వేగంగా పను లు చేస్తున్నందున వలస కూలీలకు మండలంలో డిమాండ్‌ పెరిగింది.

కూలీల కొరత తీరింది

గ్రామంలో కూలీల కొరత ఉంది. తక్కువ ఖర్చుతో వలస కూలీలు వరి నా ట్లు వేస్తున్నారు. దీంతో సమయం, డబ్బు ఆదా అవుతోంది. శాస్త్రీయ పద్ధతిలో నాట్లు వేయడం తో ఎంతోమేలు జరుగనుంది. నారు పీకడం, పంచడం వారిదే అయినందున ఖర్చులు కూడా తగ్గుతున్నాయి.

- కోదాటి విక్రంరావు, రైతు

============

రోజుకు రూ.1000 సంపాదిస్తున్నా

మా ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో జూన, జూలై మొదటి వారంలోనే నాట్లు పూర్తవుతాయి. ఉపాధి కోసం కర్ణాట క, పశ్చిమబెంగాల్‌, ఆంధ్రప్రదేశ, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్తుంటాం. ఈ ఏడాది 21 మందిలో ఇక్కడికి వచ్చాం. నెలన్నర రోజులపాటు నాట్లు వేసి ఒక్కొక్కరం రూ.50వేలు సంపాదించుకుని స్వస్థలానికి వెళతాం. మాలో రైతులు కూడా ఉన్నారు.

- కంగన, కూలీ, ఉత్తరాఖండ్‌

Updated Date - 2023-08-02T00:16:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising