ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉద్యోగులు ఐక్యంగా ముందుకుసాగాలి

ABN, First Publish Date - 2023-09-22T00:03:52+05:30

సమస్యల పరిష్కారానికి ఉద్యోగులంతా ఐక్యంగా ముందుకు సాగాలని మునిసిపల్‌ ఎంప్లాయీస్‌ ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ జి.ప్రభాకర్‌యాదవ్‌, కోకన్వీనర్‌ పర్వతాలు, శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ప్రభాకర్‌యాదవ్‌

నల్లగొండ టౌన, సెప్టెంబరు 21: సమస్యల పరిష్కారానికి ఉద్యోగులంతా ఐక్యంగా ముందుకు సాగాలని మునిసిపల్‌ ఎంప్లాయీస్‌ ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ జి.ప్రభాకర్‌యాదవ్‌, కోకన్వీనర్‌ పర్వతాలు, శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. గురువారం స్థానిక టీఎనజీవో్‌స కార్యాలయంలో నిర్వహించిన ఫోరం జిల్లా సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటులో ము నిసిపల్‌ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారన్నారు. ఉద్యోగుల హక్కుల సాధనలో భాగంగా టీఎనజీవో్‌స సంఘానికి అనుబంధంగా రాష్ట్రం లో అతిపెద్ద ఫోరం ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వివరించారు.

అనంతరం టీఎనజీవో్‌స జిల్లా అధ్యక్షుడు మంత్రవాది శ్రవణ్‌కుమార్‌ సమక్షంలో ఫోరం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పి.ప్రభాకర్‌, అసోసియేట్‌ అధ్యక్షుడిగా ఆరీఫుద్దీన, ఉపాధ్యక్షులుగా ఎంఏ.రషీద్‌, కే.విజయ్‌కుమార్‌, ఆర్‌.కల్యాణి, కార్యదర్శిగా ఎం.సుమన, సహాయ కార్యదర్శులుగా కే.యాదయ్య, జీవీ రామచంద్రారావు, ప్రశాంతి, కోశాధికారిగా జీ.శ్యాం, కార్యాలయ కార్యదర్శిగా ఎన.జాని, క్రీడాకార్యదర్శిగా సీహెచ.శ్రీరాములు, కార్యనిర్వాహక కార్యదర్శిగా వీ.యాదగిరి, ప్రచారకార్యదర్శిగా ఎం.శ్రవణ్‌, కార్యవర్గసభ్యులుగా లింగయ్య, వీ.సాయిబాబ, పీ.సరిత, సీహెచ.భవానీ, తదితరులు ఎన్నికైన వారిలో ఉన్నారు.

Updated Date - 2023-09-22T00:03:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising