పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు కృషి చేయాలి
ABN, First Publish Date - 2023-06-26T00:50:38+05:30
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ముదిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, గోపనబోయిన నాగమణి అన్నారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.
నల్లగొండ టౌన్, జూన్ 25: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ముదిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, గోపనబోయిన నాగమణి అన్నారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. పారిశుధ్య కార్మికులు లేకపోవడంతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాలలను పరిశుభ్రం చేస్తున్నారని, ఇది శోచనీయమన్నారు. కనీసం తాళాలు కూడా తీసేవారు లేరని, ధనిక రాష్ట్రంలో ఇలాంటి దుస్థితి ఏర్పడడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో అక్రమ డిప్యుటేషన్ల పేరుతో ఉపాధ్యాయుల్లో హడావిడి ప్రారంభమైందన్నారు. ఉపాధ్యాయులు ఎక్కు వ ఉండి విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల నుంచి డిప్యుటేషన్‌పై తొలుత స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో, ఆ తర్వాత మండలం, నియోజకవర్గంలో సర్దుబాటు చేయాలన్నారు. ఈ పేరుతో అక్రమ డిప్యుటేషన్లకు యత్నిస్తే పెద్దఎత్తున పోరాటా లు చేసి అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించిన సంఘం జిల్లా కార్యదర్శి విజయలక్ష్మీని అభినందించారు. అదేవిధంగా కుటుంబ సంక్షేమ నిధి జిల్లా కన్వీనర్‌గా గ్యేర నర్సింహను ఏకగ్రీవంగా నియమించారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సైదులు, ప్రధాన కార్యద ర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షుడు శ్రీనివాసాచారి, నాయకులు అరుణ, నర్ర శేఖర్‌రెడ్డి, గేర నర్సింహ, శ్రీనివా్‌సరెడ్డి, శ్రీనివాస్, రమాదేవి, విజయలక్ష్మీ, శ్యామ్‌కుమార్, నర్సింహ, పగిళ్ల సైదులు, నాగయ్య, జైపాల్, రమణ పాల్గొన్నారు.
Updated Date - 2023-06-26T00:50:38+05:30 IST