డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలి
ABN, First Publish Date - 2023-02-21T00:49:58+05:30
డ్వాక్రా సంఘాల మహిళ లకు వడ్డీలేని రుణాలివ్వాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక డిమాండ్ చేశారు.
సూర్యాపేట(కలెక్టరేట్), ఫిబ్రవరి 20: డ్వాక్రా సంఘాల మహిళ లకు వడ్డీలేని రుణాలివ్వాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ముందు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వడ్డీ లేకుండా రూ.పది లక్షల వరకు రుణాలివ్వాలన్నారు. మహిళలకు అభయ హస్తం పథకాన్ని అమలు చేయాలన్నారు. బ్యాంకర్లు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం కలెక్టర్ వెంకట్రావ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జయమ్మ, పద్మ, శ్రీదేవి, రేణుక, వెంకటమ్మ, లక్ష్మి, గౌరమ్మ పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. జిల్లాలోని 475గ్రామపంచాయతీల్లో 1745మంది కార్మికులు మల్టీపర్పస్ వర్కర్లుగా పనిచేస్తున్నారని, వారికి నెలకు ఇచ్చే వేతనం కుటుంబ పోషణకు సరిపోవడం లేదన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రాధాక్రిష్ణ, రాంబాబు, నాగరాజు, స్వరాజ్యం, వెంకన్న, సిద్దు, విజయ్‌కుమార్, సుందరయ్య, గుర్వమ్మ పాల్గొన్నారు.
నేరేడుచర్ల: నేరేడుచర్ల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన తొలి ప్రజావాణికి మూడు దరఖాస్తులు వచ్చాయి. ప్రతి సోమవారం తహసీల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజావాణి సమా వేశంలో ఆర్‌అండ్‌బీ శాఖకు సంబంధించి ఒక దరఖాస్తు వచ్చింది. ఆ శాఖ అధికారులకు పంపించనున్నట్లు తహసీల్దార్ సరిత తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకరయ్య, కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎంపీవో విజయకుమారి, ఎంఈవో ఛత్రునాయక్, వైద్యాధికారులు డాక్టర్ నాగిని, డాక్టర్ సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-21T00:50:00+05:30 IST