ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కబ్జా అవుతున్నా పట్టించుకోరా?

ABN, First Publish Date - 2023-06-26T00:37:56+05:30

భూదానోద్యమానికి నాంది పలికిన భూదాన్‌పోచంపల్లిలో ప్రభుత్వ భూములు కబ్జా అయ్యాయి.

భూదాన్‌పోచంపల్లిలోని పుత్రజయ వెంచర్‌లోని అన్యాక్రాంతమైన ప్రభుత్వ స్థలం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూదాన్‌పోచంపల్లి, జూన్‌ 25 : భూదానోద్యమానికి నాంది పలికిన భూదాన్‌పోచంపల్లిలో ప్రభుత్వ భూములు కబ్జా అయ్యాయి. అధికార పార్టీ నేతల అండదండలతో ప్రభుత్వ భూముల్లో యధేచ్ఛగా రియల్‌ దందా కొనసాగుతోంది. ప్రభుత్వ భూముల కబ్జాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ఇక్కడి వెంచర్లలోని ప్రభుత్వ భూములపై రియాల్టర్ల కన్ను పడింది. భూదాన్‌పోచంపల్లి మున్సిపల్‌ పరిధిలోని సాయిసౌధ వెంచర్‌లోని 7వేల చదరపు గజాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించిన ఓ అధికార పార్టీ నాయకుడి వైఖరిపై పెద్దఎత్తున రాజకీయ దుమారంతో తాజాగా తిరిగి ఆ భూమి రిజిస్ట్రేషన్‌ రద్దు కావడంతో భూ ఆక్రమణలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పట్టణ పరిధిలోని నారాయణగిరి శివారులోని మొహినుద్దీన్‌ కంచెగా పిలువబడే కొత్తగూడెం-పోచంపల్లి మధ్యలో ఉన్న గుట్టల మధ్య ప్రాంతంలోని 1600 ఎకరాలల్లో 609 సర్వేనెంబర్‌ నుంచి మొదలుకొని 736 సర్వేనెంబరు వరకు, పక్కనే ఉన్న ఇతర సర్వేనెంబర్‌లోని భూమికి సుమారుగా 850 ఎకరాల స్థలాన్ని ఎంవీ చౌదరి, గిరిధరన్‌, దశరథ రామయ్య అనుచర గణంతో కలిసి శ్రీమిత్ర టౌన్‌షి్‌ప, శ్రీమిత్ర ఎస్టేట్స్‌, ఇతర పేర్లతో వెంచర్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి కేటాయించిన 10ు భూములను ఖాళీ స్థలాలుగా చూపించి తదనంతరం ప్లాట్లుగా మార్చి వాటిని అమ్ముకొని కోట్లు కొల్లగొట్టిన తీరు విస్మయానికి గురిచేసింది. జీపీ, డీటీసీపీ లేఅవుట్‌ కాబట్టి ఎలాంటి ఇబ్బందులు రావని ఖాళీస్థలాలుగా వదిలిపెట్టిన ప్రభుత్వ భూములను ప్లాట్లుగా చేసి వెంచర్‌ యజమానులు, ప్రజాప్రతినిధులు అధికారుల అందండలతో దోపిడీ చేస్తున్నారు. అనుమతి లేకుండా అక్రమ లేఅవుట్‌ చేసిన వాళ్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ పేరిట కొంత డబ్బు చెల్లిస్తే ఆ వెంచర్‌ సక్రమమే అని లీగల్‌గా అప్రూవ్‌గా అవుతుందనే సాకుతో మొత్తం ప్రభుత్వ స్థలాన్ని అక్రమార్కులు దోచేస్తున్నారు.

బడా నేతలే కీలక సూత్రదారులు

2007లో ఏర్పాటైన శ్రీమిత్ర టౌన్‌షి్‌ప ప్రైవేట్‌ లిమిటెడ్‌ అండ్‌ సహచర గ్రూపులు ఏర్పాటు చేసిన వెంచర్లలో ప్రభుత్వానికి కేటాయించిన 10 శాతం భూమి ఖాళీ స్థలాలుగా ఉన్న భూములు ప్లాట్లు చేసి విక్రయించారు. పుత్రజయ-2 వెంచర్‌లో ప్రభుత్వానికి కేటాయించిన 5 ఎకరాల స్థలాన్ని అప్పనంగా జగత్‌పల్లి గ్రామానికి చెందిన నోముల ఉపేందర్‌రెడ్డికి అమ్మి, లేఅవుట్‌ పేరిట ప్లాట్స్‌ చేసి అమ్ముకుని కమీషన్‌ పేరిట కొందరు కోట్ల రూపాయలు నాయకులుసొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి కేటాయించిన 5 ఎకరాల్లో మళ్లీ 10 శాతం ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌ చేస్తాననడం చోద్యంగా ఉందని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. ఒక శ్రీమిత్ర టౌన్‌షి్‌ప ప్రైవేట్‌ లిమిటెడ్‌ వెంచర్‌ దాని అనుబంధ వెంచర్లే కాకుండా అనుమతిలేని అక్రమ లేఅవుట్‌లలో ప్రభుత్వానికి కేటాయించిన ఖాళీ స్థలాలు అన్నీ మాయమైపోతున్నాయి. శ్రీమిత్ర టౌన్‌షి్‌ప ద్వారా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌ అయిన భూమి కేవలం సుమారు 37 ఎకరాలు మాత్రమేనని, మిగిలినది ప్రభుత్వానికి రావాల్సిన భూమి తేలాల్సిన అవసరముందని స్థానికులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు

భూదాన్‌పోచంపల్లి మున్సిపల్‌ పరిధిలోని అక్రమ వెంచర్లపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. ప్రభు త్వ భూమి కబ్జా విషయం తమ దృషి ్టకి రాలేదు. ఇటీవల సుమారు 7వేల చదరపు గజాల మున్సిపల్‌ స్థలాన్ని కొందరు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకోగా, వాటిని రద్దు చేయించడం జరిగింది. అట్టి స్థలం క్రయవిక్రయాలు జరగనివ్వం. ఒకవేళ ప్రభుత్వ భూమిని ఎవరైనా కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఎలాంటి వారైనా వదిలేది లేదు. ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. మున్సిప ల్‌ స్థలం ఆక్రమిస్తే తగు చర్యలు ఉంటాయి.

- కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌, భూదాన్‌పోచంపల్లి

Updated Date - 2023-06-26T00:37:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising