చచ్చినా రావొద్దేమో!
ABN, First Publish Date - 2023-08-02T00:22:33+05:30
మృతదేహాలను మార్చురీలో పదిలంగా, అంతకు మించి గౌరవ ప్రదంగా భద్రపర్చాల్సిన బాధ్యత ప్రభు త్వ ఆస్పత్రి సిబ్బందిది. మృతదేహాలకు వైద్యులు నిర్వహించే పోస్టుమార్టం ఆధారంగానే అతడి మరణం వెనుక మిస్టరీ తేలుతుంది.
భువనగిరి మార్చురీలో మృతదేహాలను కొరికేస్తున్న ఎలుకలు
ప్రతిపాదనలకే పరిమితమైన ఆధునిక మార్చురీ
భువనగిరి టౌన్: మృతదేహాలను మార్చురీలో పదిలంగా, అంతకు మించి గౌరవ ప్రదంగా భద్రపర్చాల్సిన బాధ్యత ప్రభు త్వ ఆస్పత్రి సిబ్బందిది. మృతదేహాలకు వైద్యులు నిర్వహించే పోస్టుమార్టం ఆధారంగానే అతడి మరణం వెనుక మిస్టరీ తేలుతుంది. దీంతో మార్చురీ నిర్వహణ ను పటిష్ఠంగా చేపట్టాల్సి ఉండగా, అందుకు భిన్నమై న పరిస్థితులు భువనగిరి జిల్లా ఆస్పత్రిలోని మార్చురీ లో ఉన్నాయి. పేరుకు జిల్లా ఆస్పత్రి మార్చురీ అయినా, ఫ్రీజర్లు సహా కనీస సదుపాయాలు లేవు.
భువనగిరి జిల్లా ఆస్పత్రిలో మృతదేహాలను ఎలుకలు కొరికేస్తున్నాయి. ఆదివారం రాత్రి భువనగిరిలో ఆత్మహత్య చేసుకున్న గుంటూరు జిల్లాకు చెందిన డ్రైవర్ రవి మృతదేహాన్ని వస్త్రంతో చుట్టి కిందనే ఉంచారు. అతడి ముఖాన్ని ఎలుకలు కొరికిన దయనీయ ఘటన తాజాగా వెలుగు చూసింది. జిల్లాలోని చౌటుప్పల్, ఆలేరు, రామన్నపేట ఏరియా ఆస్పత్రుల్లో మార్చురీలను ఇటీవల నిర్మించడంతో అక్కడ పూర్తి వసతులతో పాటు ఫ్రీజర్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ, జిల్లా కేంద్రంలోని మార్చురీలో మాత్రం ఒక్కటే ఫ్రీజర్ అందుబాటులో ఉంది. భువనగిరి పరిసర ప్రాంతాల్లో రోడ్డు, రైలు ప్రమాదాల మృతులు నిత్యకృత్యంగా ఉంటుండగా, ఆత్మహత్యలు, అనుమానాస్పద మృతులు, రహదారులపై అనాథల మృతదేహాలు సర్వసాధారణమయ్యాయి. మార్చురీకి తరలించిన మృత దేహానికి ఉదయం నుంచి సాయంత్రంలోపు వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తుంటారు. కొన్ని అత్యవసర కేసుల నేపథ్యంలో రాత్రి పూట కూడా పోస్టుమార్టం నిర్వహిస్తారు. రోడ్డు, రైలు ప్రమాదాలు, అనుమానాస్పద మృతులు, అనాథల మృతదేహాల వివరాలు లభించకపోతే రెండు, మూడు రోజుల పాటు మార్చురీలో భద్రపరచాలి. భువనగిరి జిల్లా ఆస్పత్రి మార్చురీలో నెలకు కనీసం 30 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఒకే రోజు మూడుకు పైగా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో మూడుకుపైగా మృతదేహాలను భద్రపరచాలి. కానీ ఇక్కడ కేవలం ఒక్క ఫ్రీజరే అందుబాటులో ఉంది. అంతకు మించి వచ్చిన మృతదేహాలను వస్త్రంలో చుట్టి మార్చురీ గది నేలపై పడుకోబెడుతున్నారు. మృతుల బంధువుల విన్నపం మేరకు సిబ్బంది అద్దె ఫ్రీజర్లను ఏర్పాటు చేస్తుండగా, ఆ అద్దెను బంధువులు చెల్లిస్తున్నారు. అద్దె చెల్లించే బంధువులు లేని మృతదేహాలను వస్త్రంతోనే సరిపెట్టి నేలపై పడుకోబెడుతున్నారు.
ప్రతిపాదనల దశలోనే నూతన మార్చురీ
భువనగిరి ఆస్పత్రిలో అధునాతన మార్చురీ కొన్నేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. జిల్లాల పునర్విభజనకు ముందు ఏరియా ఆస్పత్రిగా ఉన్నప్పటినుంచే నూతన మార్చురీ భవనాన్ని నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఫ్రీజర్ల కొనుగోలుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన ఎంపీ అభివృద్ధి నిధులు కేటాయిస్తానని చెప్పినా, సాంకేతిక కారణాలు చూపుతూ వైద్యవిధాన పరిషత్, జిల్లా అధికారులు వినియోగించడంలేదు.
త్వరలో నూతన మార్చురీని నిర్మిస్తాం : డాక్టర్ చిన్నా నాయక్, భువనగిరి ఆస్పత్రి సూపరింటెండెంట్
జిల్లా ఆస్పత్రి మార్చురీ నిర్మాణానికి వైద్య విధాన పరిషత్ ఇటీవల కోటి రూపాయలు మంజూరు చేసింది. ఈమేరకు సెంట్రలైజ్డ్ ఏసీ మార్చురీ భవన నిర్మాణ పనులను టీఎ్‌సఎంఎ్‌సఐడీ త్వరలో ప్రా రంభించనుంది. ఆదివారం నాటి ఘటనపై టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్, కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేసి ని వేదిక అందజేశాం. త్వరలో మార్చురీ సమస్య తీరనుంది.
Updated Date - 2023-08-02T00:22:33+05:30 IST