ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధికి సహకరించాలి: జడ్పీ చైర్మన్‌ బండా

ABN, First Publish Date - 2023-01-25T00:50:00+05:30

అధికారులు, ప్రజాప్రతినిఽధులు సమన్వయంతో పనిచేసి మండలాన్ని అభివృద్ధి చేయాలని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నార్కట్‌పల్లి, జనవరి 24: అధికారులు, ప్రజాప్రతినిఽధులు సమన్వయంతో పనిచేసి మండలాన్ని అభివృద్ధి చేయాలని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి కోరారు. ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయశాఖపై సమీక్షకు వచ్చినపుడు రైతుబంధు నమోదు అంశంపై చర్చ జరుగుతున్న సందర్భంలో ఏవో ఇచ్చిన సమాధానానికి జడ్పీ ఛైర్మన్‌ వ్యాఖ్యలు సభలోనవ్వులు తెప్పించాయి. ఆఫీస్‌ సీట్లో కూర్చుంటే బోరుకొట్టదా అప్పుడప్పుడు రైతుల వద్దకు వెళ్లాలంటూ చమత్కరించడంతో సభలో నవ్వులు విరిసాయి. రోడ్లు, విద్యుత్‌ శాఖ అధికారుల పనితీ రుపై చెర్వుగట్టు, అమ్మనబోలు, అక్కెనపల్లి, చిన్నతుమ్మలగూడెం, కొండపాకగూడెంల సర్పంచ్‌, ఎంపీటీసీలు పుల్లెంల ముత్తయ్య, మేకల రాజిరెడ్డి, సైదులు మాట్లాడారు. ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ రోడ్ల దుస్థితితో ప్రమాదాలు జరిగి కొందరు చనిపోయారని దానికి బాధ్యత మీరు వహిస్తారా అని అమ్మనబోలు ఎంపీటీసీ కొంపెల్లి సైదులు నిలదీయగా సర్పంచ్‌లు గొంతుకలిపారు. ఏపీ లింగోటంలో ఓ ఇంటిపై నుంచి కొళ్ల ఫారానికి విద్యుత్‌ తీగలు వెళ్తున్నాయని వాటివల్ల ఏ ప్రమాదం జరిగినా మీరే బాధ్యత వహించాలని ఏపీ లింగోటం సర్పంచ్‌ నూకల శంకర్‌ అన్నారు. నార్కట్‌పల్లి పెద్ద్దచెర్వు శిఖం ఉన్న సర్వే నెం.481లో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని రోడ్డు వేస్తున్నా రెవెన్యూ, ఐబీ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. అమ్మనబోలు దామర చెర్వు కూడా 25ఎకరాల ఆక్ర మణకు గురవుతున్నా నీటిపారుదల శాఖ అధికారులు పట్టించు కోవ డం లేదని కొంపెల్లి సైదులు ఆరోపించారు. సంబంధిత ప్రజా ప్రతినిఽ దులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని జడ్పీ చైర్మన్‌ సూచించారు.

Updated Date - 2023-01-25T00:50:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising