ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్జాతీయ స్థాయిలో బుద్ధవనం అభివృద్ధి

ABN, First Publish Date - 2023-04-12T00:16:18+05:30

అంతర్జాతీయస్థాయిలో బుద్ధవనం అబివృద్ధికి కృషి చేస్తానని కంబోడియా బౌద్ధ భిక్షువు, సంబుద్ధ గ్లోబల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు హర్షవర్థన్‌ అన్నారు. నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును ఆయన మంగళవారం సందర్శించారు. ఉదయం బుద్ధవనానికి చేరుకున్న ఆయనకు సిబ్బంది ఘనస్వాగతం పలికారు.

బుద్ధవనంలో బౌద్ధ మత స్తూపాలను తిలకిస్తున్న హర్షవర్థన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కంబోడియా బౌద్ధ భిక్షువు హర్షవర్థన్‌

నాగార్జునసాగర్‌, ఏప్రిల్‌11: అంతర్జాతీయస్థాయిలో బుద్ధవనం అబివృద్ధికి కృషి చేస్తానని కంబోడియా బౌద్ధ భిక్షువు, సంబుద్ధ గ్లోబల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు హర్షవర్థన్‌ అన్నారు. నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును ఆయన మంగళవారం సందర్శించారు. ఉదయం బుద్ధవనానికి చేరుకున్న ఆయనకు సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత బుద్ధవనంలో చరిత వనం, జాతక వనం, స్థూప వనం, మహాస్థూపాలను తిలకించారు. మహాస్థూపం లోపలి వైపున ద్యాన మందిరంలో ద్యానంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్ధవనాన్ని అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధ ప్రతినిధులు సందర్శించేలా చేసి ఇక్కడ బౌద్ధ విశ్వవిద్యాలయం, ఆరామాల నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. అనంతరం సాగర్‌ ప్రధాన డ్యాంను తిలకించారు. ఆయనవెంట సుప్రీంకోర్టు న్యాయవాది పాల్‌, చీఫ్‌ కో ఆర్డినేటర్‌ మహిషస్త్ర, బుద్ధవనం సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2023-04-12T00:16:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising