పత్తి ఇంకా ఉంది
ABN, First Publish Date - 2023-09-04T00:55:27+05:30
వాతావరణ మార్పులతో దిగుబడులు తగ్గ డం, మార్కెట్ ధర ఒడిదొడుకులతో ఆరుగా లం కష్టపడి పండించిన పంటను విక్రయించలేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. వరుసగా మూడేళ్ల నుంచి కాలం కలిసి రాక ఆశించిన స్థాయిలో పత్తి దిగుబడులు రావడం లే దు.
ఇళ్లలో గత ఏడాది పత్తి నిల్వలు
ఏడాది నిల్వ ఉంచినా పెరగని ధర
2021-22లో పత్తి క్వింటా ధర రూ.12వేలు
మోత్కూరు: వాతావరణ మార్పులతో దిగుబడులు తగ్గ డం, మార్కెట్ ధర ఒడిదొడుకులతో ఆరుగా లం కష్టపడి పండించిన పంటను విక్రయించలేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. వరుసగా మూడేళ్ల నుంచి కాలం కలిసి రాక ఆశించిన స్థాయిలో పత్తి దిగుబడులు రావడం లే దు. గత ఏడాది ధర పెరిగాక, విక్రయించవచ్చ నే ఆశతో పత్తి నిల్వ చేశారు. పత్తి నిల్వ చేసిన రైతుల్లో కొంత మంది దిగుబడిని విక్రయించకలేక అవస్థ పడుతున్నారు. పత్తి రైతుల్లో 10శాతం మంది ఇంకా పత్తి విక్రయించకుం డా ఇంటిలోనే నిల్వ చేసి అటు ఆర్థికంగా, ఇటు చర్మవ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత ఏడాది 8,42,645 ఎకరాల్లో రైతులు పత్తి సాగుచేశారు. యాదాద్రి జిల్లాలో 1,11,038 ఎకరాలు, నల్లగొం డ జిల్లాలో 6,30,000 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 1,01,607 ఎకరాల్లో రైతులు పత్తి సా గుచేశారు. గత ఏడాది అధిక వర్షాల కారణం గా పత్తికి జాజు రోగం, చివరి దశలో గులాబీ రంగు పురుగు ఆశించి దిగుబడులు తగ్గాయి. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాల్సి ఉండగా, ఏడెనమిది క్వింటాళ్ల దిగుబడే వచ్చింది.
ధర పెరిగితే నష్టపోకుండా ఉంటామని
గత ఏడాది అధిక వర్షాల కారణంగా పత్తి చేలకు జాజు రోగం, చివరి దశలో గులాబీ పురుగు ఆశించి దిగుబడులు తగ్గాయి. ధర పె రిగితే పెట్టుబడులు మీదపడకుండా బయట పడుతామని ఆశించిన రైతులు పత్తి నిల్వ చేశారు. పత్తి ధర పెరగపోగా, పత్తిని తీసిన వెంటనే విక్రయించి ఉంటే 15 నుంచి 20 శాతం వరకు తేమ ఉండి తూకం ఎక్కువ వచ్చేది. నిల్వ చేయడంతో పత్తిలో తేమ తగ్గి తూకం తగ్గుతుంది. ఎక్కువ కాలం నిల్వ చేయడం వల్ల పత్తి అడుగు భాగాన నల్లబారి మూడు, నాలుగు క్వింటాళ్ల పనికిరాకుండా పోతుంది. పత్తి ఇళ్లలో నిల్వ చేయడంతో దురద వంటి చర్మ వ్యాధుల బారిన పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిగుబడి సమయంలో ధర లేక
2021-22లో పత్తి తీత ప్రారంభ రోజుల్లో (అక్టోబరు, నవంబరులో) క్వింటా ధర రూ.8 వేలు ఉండగా, పత్తి తీత ముగిసిన ఒకట్రెండు నెలలకు (జనవరి, ఫిబ్రవరిలో) రూ.12వేలకు ధర పెరిగింది. గత ఏడాది (2022-23లో) పత్తి తీత ప్రారంభ రోజుల్లో (అక్టోబరు, నవంబరు లో) క్వింటా రూ.8వేలు ఉండగా, గతం కంటే ధర ఎక్కువగా పెరుగుందని భావించిన రైతు లు తొలుత తీసిన మైల పత్తిని విక్రయించి ఆ తరువాత తీసిన పత్తినంతా ఇళ్లలో, వ్యవసా య బావుల వద్ద బండలపై నిల్వ చేశారు. పత్తి సీజన్ ముగిసే సరికి ధర క్వింటా రూ.7వేల కు పడిపోయింది. దీంతో ఐదారు మాసాలు పత్తిని నిల్వ చేసినా ధర పెరిగే పరిస్థితి కనిపించకోవడంతో చాలా మంది రైతులు రూ.7వేలకే విక్రయించారు. ఇంకా సుమారు 10శాతం మంది రైతులు పత్తిని విక్రయించకుండా ఇంటిలోనే నిల్వ చేసి ఉంచారు.
నేటికీ విక్రయించలేదు : మధు, పత్తి రైతు, జామచెట్లబావి
గత ఏడాది 15 ఎకరాల్లో పత్తి సాగుచేశా. మొదట్లో తీసిన మైల పత్తి విక్రయిం చా. అప్పట్లో క్వింటా రూ.8 వేలు ఉండగా, ఆ తర్వాత రూ.7వేలకు ధర పడిపోయింది. సీజన్ ముగిశాక పెరుగుతుందన్న భావనతో సుమారు 80 క్వింటాళ్ల పత్తి రామునిబండ మీద నిల్వ చేశా. ధర పెరగకపోవడంతో ఇప్పటికీ విక్రయించలేదు. అప్పు డు విక్రయించి ఉంటే తూకం ఎక్కువ వచ్చేది. ఇప్పుడు తూకం తగ్గుతుంది. అడుగున మూ డు, నాలుగు క్వింటాళ్ల పత్తి నల్లబారింది. పెట్టుబడులకు తెచ్చిన అప్పులకు వడ్డీ పెరిగింది. ఇలా నాలుగు విధాలా నష్టపోయా.
Updated Date - 2023-09-04T00:55:27+05:30 IST