ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీజేపీ, బీఆర్‌ఎస్‌ పరస్పర సహకారం

ABN, First Publish Date - 2023-06-26T00:47:34+05:30

రాజకీయ అవసరాలు, ఆర్థిక లావాదేవీల కోసమే ధిల్లీలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటున్నాయని సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర 102 రోజు ఆదివారం జిల్లాకేంద్రంలో కొనసాగింది. ఈ సం దర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం, అనంతరం కార్న ర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ సాధించుకుంటే దశాబ్ది కాలమవుతున్నా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదన్నారు.

జిల్లాకేంద్రంలో అభివాదం చేస్తున్న భట్టి, పక్కన రమేష్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజకీయ అవసరాలు, ఆర్థిక లావాదేవాల కోసమే

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ నేతల జీవితాలే మారాయి

ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదు

సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క

సూర్యాపేట,సూర్యాపేటటౌన్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): రాజకీయ అవసరాలు, ఆర్థిక లావాదేవీల కోసమే ధిల్లీలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటున్నాయని సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర 102 రోజు ఆదివారం జిల్లాకేంద్రంలో కొనసాగింది. ఈ సం దర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం, అనంతరం కార్న ర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ సాధించుకుంటే దశాబ్ది కాలమవుతున్నా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదన్నారు. సీఎం కేసీఆర్‌ పదేళ్ల పాలనలో కేవలం బీఆర్‌ఎస్‌ నాయకుల జీవితాలు మారాయని, ప్రజల ఆకాంక్షలను అపహాస్యం చేశారన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు వేల కోట్ల రూపాయలు సంపాదించారని, ఫాంహౌ్‌సలు నిర్మించుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భద్రాద్రి పవర్‌ప్లాంట్‌ అవుట్‌డేటెడ్‌ టెక్నాలజీ అని, యదాద్రి పవర్‌ప్లాంట్‌ పదేళ్లవుతున్నా పూర్తి కాలేదని ఆరోపించారు.

కాంగ్రెస్‌ హయాంలోనే ఎస్సారెస్పీ

కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట జిల్లాకు నీరొస్తే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో కేసీఆర్‌ నీళ్లంటూ జలహారతి ఇవ్వడం విడ్డూరంగా ఉందని విక్రమార్క అన్నారు. సూర్యాపేట జిల్లా నుంచి కాంగ్రెస్‌ నాయకులు ప్రజలకు నిస్వార్థ సేవలు చేశారని, తమ విలువైన భూములను అమ్ముకొని ప్రజల కోసం పనిచేస్తే ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నాయకులు వేలకోట్లు అర్జిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర మంత్రి జగదీ్‌షరెడ్డి జిల్లాలో యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ పనులు నేటికీ పూర్తి చేయలేదని, నీటి ప్రాజెక్టులను తీసుకురాలేదని, ఎలాంటి అభివృద్ధి చేయని మంత్రి జగదీ్‌షరెడ్డి శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రజాప్రతినిధులుగా ఉండడందేనికన్నారు. కాంగ్రెస్‌ ఏం చేసిందని బీఆర్‌ఎస్‌ నాయకులు అడిగే ముందు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏంచేసిందో ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్‌ పాలనలోనే ప్రాజెక్టులు, రోడ్లు నిర్మించడం జరిగిందని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందజేశామన్నారు. సీఎం కేసీఆర్‌ చేతిలో పడి రాష్ట్రం నలిగిపోతుందని, బీఆర్‌ఎ్‌సను ఓడించడానికి ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. అంతకుందు ఎమ్మార్పీఎస్‌ నాయకులు పాల్వాయి పరశురాం భట్టి విక్రమార్కకు తుంగతుర్తి ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారని వినతిపత్రం అందజేశారు. దళితబంధులో అక్రమాలు, ఇసుక మాఫియాకు పాల్పడుతూ వేలకోట్లు సంపాదించారని ఆరోపించారు. భట్టి విక్రమార్క పాదయాత్రకు సినీ నిర్మాత బండ్ల గణేష్‌ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్‌ రమే్‌షరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌, అన్నెపర్తి జ్ఞానసుందర్‌, తండు శ్రీనివా్‌సయాదవ్‌, తిరుమల ప్రగడ అనురాధ, అనుములపురి రవి, అజ్మతుల్లా, కుమార్‌రావు, గుడిపాటి నర్సయ్య, అంజద్‌అలీ, చికలం రాజేశ్వర్‌రావు, వెంకన్ననాయక్‌, నాగిరెడ్డి మమతారెడ్డి, కక్కిరేణి శ్రీనివాస్‌, బైరు శైలేందర్‌గౌడ్‌, నెల్లుట్ల లింగస్వామి పాల్గొన్నారు.

ఇరువర్గాల మధ్య ఘర్షణ

జిల్లాకేంద్రంలోకి ప్రవేశించిన భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌లో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్‌ రమే్‌షరెడ్డి అనుచర వర్గాల మధ్య ఆదివారం ఘర్షణ నెలకొంది. సీఎల్పీ భట్టి విక్రమార్క సాయంత్రం తాను బసచేసిన ఫంక్షన్‌ హాల్‌ నుంచి పీపుల్స్‌ మార్చ్‌ ద్వారా పాదయాత్రగా ముందుకు రాగా, అక్కడే ఆగి ఉన్న పటేల్‌ రమేష్‌రెడ్డి భట్టిని కలిసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో తన డ్రైవర్‌ సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తుండగా అక్కడికి వచ్చిన కొంతమంది కార్యకర్తలు అతని చేయిపై, భుజంపై కర్రలు, పైపులతో దాడిచేశారు. దీంతో అక్కడి ఉన్న ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం పాదయాత్ర జిల్లా కేంద్రంలో జరుగుతున్నంత సేపు ఉత్కంఠపరిస్థితి నెలకొంది. దాదాపు 2గంటలకు పైగా జరిగిన యాత్రలో పోలీసులు, భట్టి వ్యక్తి గత అనుచరులు అప్రమత్తంగా ఉన్నారు.

జై దామన్న.. జై పటేల్‌రమేష్‌రెడ్డి

ఇదిలా ఉంటే భట్టి విక్రమార్క పాదయాత్రకు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి శనివారం భారీగా జనసమీకరణ చేసి ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర క్రమంలో కుసుమవారిగూడెం వద్ద టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్‌ రమే్‌షరెడ్డి స్వాగతం పలికేందుకు చేరుకున్నారు. పాదయాత్ర దగ్గరికి సమీపించగా దామోదర్‌రెడ్డి వర్గీయులు జై దామన్న అంటూ నినాదాలు చేశారు. రమే్‌షరెడ్డి వర్గీయులు జై పటేల్‌ రమే్‌షరెడ్డి అంటూ నినాదాలు చేశారు. చివరికి తోపులాట, ఇరువర్గాల బాహాబాహీ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి స్వల్ప లాఠీచార్జీతో ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో ఇరు వర్గాలకు స్వల్ప గాయాలయ్యాయి.

Updated Date - 2023-06-26T00:47:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising