ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చెత్త’ వాహనాల నిర్వహణలో అస్తవ్యస్తం

ABN, First Publish Date - 2023-06-03T00:19:18+05:30

చెత్త తరలింపు వాహనాల నిర్వహణలో అధికారులు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. చేతినిండా బడ్జెట్‌, బోలెడంత పని, వందలాది మంది సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ పారిశుధ్య, ఇంజనీరింగ్‌ పనుల్లో కీలకమైన వాహనాల నిర్వహణలో మాత్రం భువనగిరి మునిసిపల్‌ యంత్రాంగం పట్టించుకోవడంలేదు.

సెల్ఫ్‌లేని వాహనాన్ని నెడుతున్న మునిసిపల్‌ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టించుకోని మునిసిపల్‌ యంత్రాంగం

ఇబ్బందులు పడుతున్న పారిశుధ్య సిబ్బంది

భువనగిరి టౌన్‌, జూన్‌ 2: చెత్త తరలింపు వాహనాల నిర్వహణలో అధికారులు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. చేతినిండా బడ్జెట్‌, బోలెడంత పని, వందలాది మంది సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ పారిశుధ్య, ఇంజనీరింగ్‌ పనుల్లో కీలకమైన వాహనాల నిర్వహణలో మాత్రం భువనగిరి మునిసిపల్‌ యంత్రాంగం పట్టించుకోవడంలేదు. ఫలితంగా పలు వాహనాలకు బీమా, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు లేకపోవడం, మరమ్మతులకు నోచకపోవడంతోపాటు లైసెన్స్‌లేని డ్రైవర్లతోనే వాహనాలను నడిపిస్తుండడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌, రోజువారీ పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని మునిసిపల్‌ అధికారులు చేస్తున్న ప్రచారం ఆర్భాటానికే పరిమితమవుతోందని విమర్శలు వస్తున్నాయి.

మునిసిపాలిటీలో 26 వాహనాలు

భువనగిరి మునిసిపాలిటీలో పారిశుధ్య, ఇంజనీరిం గ్‌ విభాగాల్లో ప్రస్తుతం 26 వాహనాలున్నాయి. ఒక ఎక్సకవేటర్‌, రహదారులను శుభ్రంచేసే వాహనం, అందుబాటులో ఉండగా పట్టణ ప్రగతి, పర్వదినాల్లో మరికొన్ని వాహనాలను తాత్కాలిక ప్రాతిపాదికన అద్దెకు తీసుకుంటున్నారు. పారిశుధ్య విభాగంలో 18 చెత్త సేకరణ ఆటోలు, 4 ట్రాక్టర్లు, ఇంజనీరింగ్‌ విభాగంలో 4 ట్రాక్టర్లు, ట్యాంకర్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజువారీగా పట్టణంలోని 35 వార్డుల్లో సుమారు 35 మెట్రిక్‌ టన్నుల చెత్తను సేకరించి కంపోస్ట్‌ యార్డుకు తరలిస్తారు. ఇంజనీరింగ్‌ విభాగంలోని వాహనాలతో పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంటారు. కానీ వాహనాల్లో తలెత్తే మరమ్మతు పనులపై మాత్రం శ్రద్ధ కొరవడింది. రెండు చెత్త సేకరణ ట్రాక్టర్లలో కొన్ని నెలలుగా సెల్ఫ్‌ ప్రాబ్లమ్‌ నెలకొనగా మరమ్మతులపై అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో చెత్త సేకరణకోసం ఆపిన ప్రతీసారి ఆ వాహనాలను నెట్టుకుంటూ స్టార్ట్‌ చేసుకోవాల్సి వస్తోంది. మరో నాలుగు వాహనాల బీమా గడువు ముగిసి నెలలు గడుస్తున్నా నేటికీ ప్రీమియం మాత్రం చెల్లించలేదు. మరో నాలుగు వాహనాలకు ఏళ్ల తరబడి ఎంవీఐ కార్యాలయంలో ఫిట్‌నెస్‌ చేయించకపోగా ఇప్పటివరకు ఆ వాహనాలకు బీమానే లేదు. అలాగే మరో ఆరు వాహనాలను లైసెన్స్‌లేని డ్రైవర్లతోనే నడిపిస్తూ కాలం వెళ్లదీస్తుండడం గమనార్హం. అనుకోని ప్రమాదం జరిగితే సంభవించే నష్టానికి బాధ్యులెవరని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు. సకాలంలో ఆస్తి పన్ను, ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు, నీటి చార్జీలు చెల్లించని ప్రజలపై అపరాధ రుసుము వేస్తున్న మునిసిపల్‌ యంత్రాంగం వాహనాల నిర్వహణలో తాము చేస్తున్న తప్పును ముందుగా సరిదిద్దుకోవాలని అంటున్నారు. అలాగే ఎంవీఐ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు మునిసిపల్‌ వాహనాలను కూడా తనిఖీ చేసే బాధ్యతను విస్మరిస్తుండడంతో మునిసిపల్‌ వాహనాల నిర్వహణ లోపిస్తున్నదని పలువురు అంటున్నారు.

మరమ్మతులు చేపడతాం : ప్రసాద్‌రావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, భువనగిరి మునిసిపాలిటీ

వాహనాలకు మరమ్మతులు చేయిస్తాం. సాంకేతిక కారణాలతో నిలిచిన వాహన బీమాను చెల్లిస్తాం. వాహనాల లైఫ్‌ టైం కారణంగా కొన్ని వాహనాలకు ఎంవీఐ కార్యాలయం ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ చేయడం లేదు. తప్పని పరిస్థితుల్లో బ్యాడ్జిలేని డ్రైవర్లతో వాహనాలను నడిపించాల్సి వస్తోంది. అయితే లైసెన్స్‌, బ్యాడ్జి నెంబర్‌ ఉంటేనే వాహనాలను నడిపేలా చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2023-06-03T00:19:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising