ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎమర్జెన్సీని తలపిస్తున్న బీఆర్‌ఎస్‌ పాలన

ABN, First Publish Date - 2023-06-26T01:29:06+05:30

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పాలన దేశంలో ఇందిరా గాంధీ 1975 జూన 25న విధించిన ఎమర్జెన్సీ విధానాన్ని తలపిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు విమర్శించారు.

సమావేశంలో మాట్లాడుతున్న సంకినేని వెంకటేశ్వర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట సిటీ, జూన 25: రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పాలన దేశంలో ఇందిరా గాంధీ 1975 జూన 25న విధించిన ఎమర్జెన్సీ విధానాన్ని తలపిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు విమర్శించారు.ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన హాల్‌లో ‘పార్లమెంటరీ ప్రవాస్‌ యోజన, ఎమర్జెనీ మరియు మేధావుల సమావేశం’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర పార్లమెంట్‌ ఇనచార్జి మారుతినేని ధర్మారావు, బీజేపీ జాతీయ నాయకుడు చింత సామమూర్తితో కలిసి ఆయన మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్నందున సీఎం కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకువస్తున్నారని అ న్నారు. 2014, 2018 ఎన్నికల్లోన ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్‌ అమలు చేయలేదన్నారు. అధికార పార్టీ పరిపాలనా విధానాలను ప్రశ్నించిన, విమర్శించిన వారిని నిర్భంధించి ఆక్రమ కేసులు పెట్టి ఇబ్బందులుకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహించే స్వేచ్ఛ లేకుండా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక అంక్షలు విధి స్తోందన్నారు. ఽధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందని, ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ రోడ్లపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంకెళ్లు వేశార న్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఓడిస్తార న్నారు. బీజేపీ రాష్ట్ర పార్లమెంట్‌ ఇనచార్జి మారుతినేని ధర్మారావు మాట్లాడుతూ ఆనాడు ఇందిరాగాంధీ ఉగ్రవాదులను పెంచి పోషించిం దన్నారు. ఎమర్జెనీ సమయంలో దేశంలో ఒక భయానక వాతావరణం సృష్టించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అత్యవసర పరిస్థి తికి వ్యతిరేకంగా పోరాటం చేసిన జనసంఘ్‌ నాయకులపై ఆక్రమంగా కేసులు పెట్టారన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రమే దేశవ్యాప్తంగా పోరాటం చేసి విజయం సాధించిందన్నారు. అనంతరం ఎమర్జెనీ సమయంలో ఆక్రమ కేసులకు గురై జైలు జీవితం గడిపిన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరిని సన్మానించారు. కార్యక్ర మంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, ఉపాధ్యక్షుడు చలమళ్ల నరసింహ, పార్లమెంట్‌ కోకన్వీనర్‌ తుక్కాని మన్మథరెడ్డి, చలికంటి వీరేం ద్ర, మీర్‌అక్బర్‌, మల్స మల్సూర్‌ గౌడ్‌, వల్థాస్‌ ఉపేందర్‌, కొప్పుల కాంత్రి రెడ్డి, ఆరూరి శివ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సంకినేని వెంకటేశ్వర్‌రావు

కాంగ్రెస్‌ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణ

పెనపహాడ్‌, జూన 25: కాంగ్రెస్‌ పార్టీకి ప్రజాదరణ పెరిగిందని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు తూముల సురేష్‌రావు అన్నారు. ఆదివారం సూర్యాపేటలో నిర్వహిస్తున్న సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రకు పెనపహాడ్‌ మండలం నుంచి కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ దుకాణం మూసివేసే సమయం వచ్చిందని ఆయన అన్నారు. కార్యక్రమంలో భూక్య శివనాయక్‌, ఒగ్గు రవి, కత్తి రవీందర్‌, శ్రీను నాయక్‌, ఉపేందర్‌, లక్ష్మణ్‌బాబు, వెంకన్న, కోటయ్య, కేశవులు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రం నుంచి సూర్యాపేటకు వెళుతున్న కాంగ్రెస్‌ కార్యకర్తలుసూర్యాపేట సిటీ, జూన 25: BRS regime facing emergencyఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన హాల్‌లో ‘పార్లమెంటరీ ప్రవాస్‌ యోజన, ఎమర్జెనీ మరియు మేధావుల సమావేశం’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర పార్లమెంట్‌ ఇనచార్జి మారుతినేని ధర్మారావు, బీజేపీ జాతీయ నాయకుడు చింత సామమూర్తితో కలిసి ఆయన మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్నందున సీఎం కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకువస్తున్నారని అ న్నారు. 2014, 2018 ఎన్నికల్లోన ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్‌ అమలు చేయలేదన్నారు. అధికార పార్టీ పరిపాలనా విధానాలను ప్రశ్నించిన, విమర్శించిన వారిని నిర్భంధించి ఆక్రమ కేసులు పెట్టి ఇబ్బందులుకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహించే స్వేచ్ఛ లేకుండా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక అంక్షలు విధి స్తోందన్నారు. ఽధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందని, ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ రోడ్లపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంకెళ్లు వేశార న్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఓడిస్తార న్నారు. బీజేపీ రాష్ట్ర పార్లమెంట్‌ ఇనచార్జి మారుతినేని ధర్మారావు మాట్లాడుతూ ఆనాడు ఇందిరాగాంధీ ఉగ్రవాదులను పెంచి పోషించిం దన్నారు. ఎమర్జెనీ సమయంలో దేశంలో ఒక భయానక వాతావరణం సృష్టించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అత్యవసర పరిస్థి తికి వ్యతిరేకంగా పోరాటం చేసిన జనసంఘ్‌ నాయకులపై ఆక్రమంగా కేసులు పెట్టారన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రమే దేశవ్యాప్తంగా పోరాటం చేసి విజయం సాధించిందన్నారు. అనంతరం ఎమర్జెనీ సమయంలో ఆక్రమ కేసులకు గురై జైలు జీవితం గడిపిన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరిని సన్మానించారు. కార్యక్ర మంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, ఉపాధ్యక్షుడు చలమళ్ల నరసింహ, పార్లమెంట్‌ కోకన్వీనర్‌ తుక్కాని మన్మథరెడ్డి, చలికంటి వీరేం ద్ర, మీర్‌అక్బర్‌, మల్స మల్సూర్‌ గౌడ్‌, వల్థాస్‌ ఉపేందర్‌, కొప్పుల కాంత్రి రెడ్డి, ఆరూరి శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T01:29:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising