ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేర్వేరు కారణాలతో ఇద్దరి బలవన్మరణం

ABN, First Publish Date - 2023-05-02T00:43:52+05:30

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకే రోజు ఇద్దరు యువకులు వేర్వేరు కారణాలతో సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి టౌన్‌/భువనగిరి రూరల్‌, మే 1: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకే రోజు ఇద్దరు యువకులు వేర్వేరు కారణాలతో సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణ ఇన్స్‌పెక్టర్‌ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. జమిలాపేట గ్రామానికి చెందిన జెట్టజోజు కల్యాణ్‌చారి(24) భువనగిరిలోని ఎంకే మొబైల్స్‌లో పని చేస్తూ మరో మిత్రుడు రాకే్‌షకుమార్‌తో కలిసి అద్దెకు ఉంటున్నాడు. ఈ నేపఽథ్యంలో మిత్రుడు రాజే్‌షకుమార్‌ తండ్రి ఆరో గ్యం బాగాలేకపోవడంతో గత నెల 27న అతను సొంతూరికి వెళ్లాడు. తిరిగి సోమవారం భువనగిరికి వచ్చి అద్దెకు ఉంటున్న గది తలుపులు తట్టినప్పటికీ కల్యాణచారి తీయకపోవడంతో అనుమానంతో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు గది తలుపులను బలవంతంగా తెరవడంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఇన్స్‌పెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు.

గంగసానిపల్లిలో

భువనగిరి మండలంలోని గంగసానిపల్లిలో కుటుంబ కలహాలతో సోమవారం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బంటు ప్రవీణ్‌ (25) ఆదివారం మండలంలోని చీమలకొండూరులో జరిగిన దుర్గమ్మ పండుగకు వెళ్లి ఇంటికి వచ్చాడు. కాగా వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెళ్లగా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రవీణ్‌ తండ్రి స్వామి ఫిర్యాదుమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి రూరల్‌ ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌ తెలిపారు.

Updated Date - 2023-05-02T00:43:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising