బతుకమ్మ చీరలను తిరస్కరించి నిరసన
ABN, First Publish Date - 2023-10-07T23:37:52+05:30
వేములకొండను నూతన మత్స్యాద్రి వేములకొండ మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మహిళలు శనివారం వినూత్నంగా నిరసన తెలిపారు.
వేములకొండ గ్రామపంచాయతీ ఎదుట నిరసన తెలుపుతున్న మహిళలు
వలిగొండ, అక్టోబరు 7 : వేములకొండను నూతన మత్స్యాద్రి వేములకొండ మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మహిళలు శనివారం వినూత్నంగా నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను తిరస్కరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ నూతన మండలం ప్రకటించాలని 442 రోజుల నుంచి నిరసన చేపడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. నిరసన తెలిపిన వారిలో వింజమూరి నర్సమ్మ, నల్ల గంగమ్మ, దాసరి అండాలు, కోట అనిత, బుచ్చమ్మ, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-10-07T23:37:52+05:30 IST