ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక

ABN, First Publish Date - 2023-10-13T00:52:19+05:30

బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అని పలు పాఠశాలల హెచఎంలు, డైరెక్టర్లు అన్నారు.

సూర్యాపేటలోని త్రివేణి పాఠశాలలో బతుకమ్మ ఆడుతున్న విద్యార్థినులు

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌: బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అని పలు పాఠశాలల హెచఎంలు, డైరెక్టర్లు అన్నారు. విద్యా సంస్థలకు దసరా సెలవులను ఈ నెల 13వ తేదీ నుంచి ప్రకటించడంతో గురువారం జిల్లాలోని పలు పాఠశాలల్లో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఆట-పాటలతో విద్యార్థులు అలరించారు.

- నడిగూడెంలోని శ్రీసాయి పబ్లిక్‌ స్కూల్‌లో చిన్నారులు రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడి పాడారు. కోలాట ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సులోచన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- మఠంపల్లి మండల కేంద్రంలోని సెయింట్‌ ఆన్స, మాన ఫోర్టు పాఠశాలలో బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో సిస్టర్‌ సుజాత పాల్గొన్నారు.

- సూర్యాపేట మునిసిపాలిటీ పరిధిలోని రాయినిగూడెం శివారులో ఉన్న శాస్త్ర పాఠశాలలో బతుకమ్మ వేడుకలను ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం దుర్గాదేవి పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన చంద్రశేఖర్‌, డైరక్టర్లు కరుణారావు, పుష్పలత, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- హుజూర్‌నగర్‌లోని ఎండీఆర్‌, ఆర్కిడ్స్‌, శ్రీచైతన్య టెక్నో పాఠశాలలో ఎంగిలి బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో దామోదర్‌రెడ్డి, సరిత, ప్రసాద్‌, కర్ణ, రాకేష్‌, భూపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి, వెంకటరమణ, వెంకటరెడ్డి, రాంప్రసాద్‌, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

- పెనపహాడ్‌ మండలంలోని అనంతారం గ్రామంలోని అరవిందో మాత పాఠశాలలో, గరిడేపల్లి, తిరుమలగిరి, నూతనకల్‌ మండలాల్లో చిన్నారులు బతుకమ్మ ఆటలు ఆడారు. కార్యక్రమంలో ఎంఈవో నకిరేకంటి రవి ప్రిన్సిపాల్‌ షేక్‌ మస్తాన, పాల్గొన్నారు.

-నేరేడుచర్లలోని కృష్ణవేణి, అంజలిస్కూల్‌, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అందంగా బతుకమ్మలను పేర్చి ఒక్కొక్కపూవేసి చందమామా.. అంటూ పాటలు పాడుతూ ఉల్లాసంగా గడిపారు. కార్యక్రమంలో జడ్పీహెచ్‌స్‌ హెచఎం బట్టు మధు,్ల కృష్ణవేణి, అంజలి స్కూల్‌ డైరక్టర్లు అలుక సైదిరెడ్డి, నళిని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-13T00:52:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising