ఈవీఎంలపై అవగాహన కల్పించాలి : కలెక్టర్
ABN, First Publish Date - 2023-07-21T01:11:14+05:30
ఈవీఎంలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పమేలాసత్పథి సూచించారు. కలెక్టరేట్‌లో ఈవీఎంల ప్రదర్శన ద్వారా ఓటు హక్కు వినియోగంపై సంచార ప్రదర్శన రథాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ఈవీఎం, కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లపై అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్‌లో ప్రదర్శించాలన్నారు.
భువనగిరి అర్బన్, జూలై20: ఈవీఎంలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పమేలాసత్పథి సూచించారు. కలెక్టరేట్‌లో ఈవీఎంల ప్రదర్శన ద్వారా ఓటు హక్కు వినియోగంపై సంచార ప్రదర్శన రథాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ఈవీఎం, కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లపై అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్‌లో ప్రదర్శించాలన్నారు. భువనగిరి ఆర్డీవో, ఆలేరు తహసీల్దార్ కార్యాలయాల్లో అవగాహన కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ అవగాహన కేంద్రాల్లో ఓటు వేసే ప్రక్రియను తెలుసుకోవచ్చన్నారు. ప్రజలకు అవగాహనకోసం క్షేత్రస్థాయిలో మొబైల్ వాహనాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ, అదనపు కలెక్టర్(రెవెన్యూ) ఏ. భాస్కర్‌రావు, భువనగిరి ఆర్డీవో అమరేందర్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ఎం.నాగేశ్వరచారి, భువనగిరి తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సురేష్, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి భట్టు రామచంద్రయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-21T01:11:14+05:30 IST