ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు

ABN, First Publish Date - 2023-01-25T00:54:52+05:30

గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేస్తోంది. మరో రోజు మాత్రమే సమయం ఉండటంతో అన్ని శాఖల అధికారులు కూడా వేడుకలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు.

వేడుకలకు సిద్ధమైన కలెక్టరేట్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి, భువనగిరి అర్బన్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి): గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేస్తోంది. మరో రోజు మాత్రమే సమయం ఉండటంతో అన్ని శాఖల అధికారులు కూడా వేడుకలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. భువనగిరి మునిసిపాలిటీ పరిధిలోని రాయిగిరిలో నిర్మించిన నూతన కలెక్టరేట్‌లో మొదటిసారిగా గణతంత్ర దినోత్సవం జరగనుంది. ఈమేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరించే స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు మంగళవారం కలెక్టరేట్‌ ఆవరణలో స్థలాన్ని పరిశీలించారు. జాతీయజెండాను కలెక్టర్‌ ఆవిష్కరించేందుకు కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం ముందు మూడు రంగుల దిమ్మెను ఏర్పాటుచేశారు. పోలీసుల గౌరవ వందనంతోపాటు కవాతు నిర్వహించేందుకు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కలెక్టరేట్‌ ఆవరణలో ప్రాక్టీస్‌ చేయనున్నారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ భవనానికి ఏర్పాటు చేసిన బోర్డును సరిచేశారు.

Updated Date - 2023-01-25T00:54:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising