ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మిర్యాలగూడ జిల్లా కోసం మరోసారి పోరు

ABN, First Publish Date - 2023-09-26T00:21:23+05:30

మిర్యాలగూడను జిల్లా చేయాలని కోరుతూ జిల్లా సాధన సమితి నేతలు మ రోసారి ఉద్యమానికి పదును పెడుతున్నారు. 2019లో జిల్లా ఏర్పాటు కోసం సుమారు మూడునెలల పాటు ఉద్య మం సాగించినా, నేతలు కలిసి రాకపోవటంతో బలంగా ముందుకు సాగించలేకపోయారు.

ఎన్నికల వేళ ప్రభుత్వం ఒత్తిడి పెంచేందుకు స్థానిక నేతల నిర్ణయం

27న పట్టణ బంద్‌

మిర్యాలగూడ, సెప్టెంబరు 25: మిర్యాలగూడను జిల్లా చేయాలని కోరుతూ జిల్లా సాధన సమితి నేతలు మ రోసారి ఉద్యమానికి పదును పెడుతున్నారు. 2019లో జిల్లా ఏర్పాటు కోసం సుమారు మూడునెలల పాటు ఉద్య మం సాగించినా, నేతలు కలిసి రాకపోవటంతో బలంగా ముందుకు సాగించలేకపోయారు. జిల్లాల పునర్విభజన స మయంలో సూర్యాపేట కంటే అధికంగా అన్ని వనరులున్న మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు కోసం పట్టుబట్టడంలో తడబడిన నేతలు అనంతరం జరిగిన పరిణామాలతో సూర్యాపేట జిల్లాలో కలపకుండా నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలనే ఉద్యమానికి పరిమిత మయ్యారు. నాడు నేతలు పట్టించుకోకపోవడం వల్లే జిల్లా హోదా దక్కకుండా పోయిందని, ఈ సారైనా జిల్లాను సాధించేందుకు కలిసి రావాలని జిల్లా సాధన సమితి నేతలు కోరుతున్నారు.

ఎన్నో జిల్లాల కంటే అధిక వనరులు

అన్ని అర్హతలున్న మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చే యాలన్న డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతోంది. నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాలను కలిపితే 18 మండలాలు, 9లక్షల జనాభా, ఐదు మున్సిపాలిటీలుగా జిల్లా అవతరిస్తుంది. ఎన్నో కొత్త జిల్లాల కంటే అన్ని రంగాల్లో ముందంజలో ఉండే అవకాశం ఉంది. ఆసి యా ఖండంలో అతి ఎక్కువ రైసుమిల్లులు ఉన్న ప్రాం తంగా ఇప్పటికే ప్రసిద్ధికెక్కింది. కృష్ణా, మూసీ నదులతో ఆయకట్టు భూములు, జాతీయ రోడ్లు, రైల్వే రవాణ మార్గాలతో వాణిజ్య కేంద్రంగా బాసిల్లుతోంది. సిమెంట్‌ పరిశ్రమ లు, నాపరాతి పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు, ఇక్కడ పనిచేసేందుకు బీహార్‌, ఒడిషా, అసోం, తదితర రాష్ట్రాల నుం చి వచ్చిన వలస కార్మికులతో జనసాంద్రత ఉన్న పట్టణం గా నిలుస్తోంది. ఇన్ని వనరులు ఉన్న మిర్యాలగూడకు జిల్లా హోదా దక్కకపోగా, గతంలో ఉన్న పార్లమెంట్‌ స్థానం కూడా కోల్పోయింది. నాగార్జునసాగర్‌, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేలను కలుపుకుని సీఎంతో చర్చించి జిల్లా ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని లేదంటే, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన సమితి నేతలు కోరుతున్నారు.

గతంలోనూ ఉద్యమాలు

జిల్లా ఏర్పాటు ఉద్యమంలో భాగంగా 2019లో సీపీఎం ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రిలే నిరాహార దీక్షలు నిర్వహించి జిల్లా ఏర్పాటు కాంక్షను తెలియజేశారు. 2019 మార్చిలో సీపీఐకి చెందిన బంటు వెంకటేశ్వర్లు, ఎంసీపీఐకి చెందిన వస్కుల మట్టయ్య, బీజేపీ నాయకురాలు పాదూరి కరుణతో కలిసి అఖిలపక్షం ఆధ్వర్యంలో మంత్రి జగదీ్‌షరెడ్డిని కలిసి జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేస్తూ వినితిపత్రం అందజేశారు.

గట్టుప్పల్‌ను మండలంగా ఏర్పాటు చేయడంతో మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు మలిదశ ఉద్యమం మొదలైంది. జిల్లా ఏర్పాటు విషయంలో సీఎం కేసీఆర్‌తో మాట్లాడి సానుకూలంగా స్పందించేలా చేయాలని ఎమ్మెల్యే భాస్కర్‌రావుపై జిల్లా సాధన సమితి నేతలు ఒత్తిడి తెచ్చారు. జూలై 18న సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే భాస్కర్‌రావు వినతిపత్రం అందజేసి గత ఆగస్టులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

27న పట్టణ బంద్‌కు పిలుపు

జిల్లా ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షను బలంగా ప్రభుత్వానికి తెలిపేందుకు జిల్లా సాధన సమితి నేతృత్వంలో ఈ నెల 27 బుధవారం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. అన్ని వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు, రైస్‌మిల్లులు, సినిమా థియేటర్లు, స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపాలని ఇప్పటికే ప్రచారం నిర్వహించారు.

ఎన్నికల వేళ ఉద్యమ బాట

ఎన్నికల సమయంలో మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు స్థానిక నేతలు పట్టుదలగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్‌, అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మునిసిపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌, అన్నభీమోజు నాగార్జునాచారి తదితరులు ఉద్యమబావుట ఎగురవేస్తున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ నేత బత్తుల లక్ష్మారెడ్డి సైతం ఉద్యమానికి తన వంతు మద్దతు ప్రకటించారు. 2019 నుంచి జిల్లా ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ వచ్చిన సామాజిక ఉద్యమకారులు జాడి రాజు, చింత పద్మ, శ్రీధర్‌, సాజీద్‌ఖాన్‌, 2022 మలిదశ ఉద్యమంలో కలిసి వచ్చిన బంజారా ఉద్యోగుల సంఘం నాయకులు దశరధనాయక్‌, బంటు వెంకటేశ్వర్లు, జయరాజు, ఫరూక్‌, మారం శ్రీనివాస్‌, మాలమహానాడు, బీసీ సంఘం ఇతర ప్రజా సంఘాల నేతలతో కలిసి ఉద్యమాన్ని వ్యూహాత్మకంగా ముందుకు సాగించేందుకు కార్యాచరణ ప్రారంభించారు.

Updated Date - 2023-09-26T00:21:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising