‘ అంగన్వాడీ’ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా
ABN, First Publish Date - 2023-02-01T01:52:33+05:30
మాతా శిశు సంరక్షణలో కీలక పాత్ర వహిస్తున్న అంగన్వాడీ టీచర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్ల య్య యాదవ్ అన్నారు.
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
కోదాడ, జనవరి 31: మాతా శిశు సంరక్షణలో కీలక పాత్ర వహిస్తున్న అంగన్వాడీ టీచర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్ల య్య యాదవ్ అన్నారు. మంగళవారం కోదాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లతో నిర్వహించిన సమీక్షా సమావే శంలో ఆయన మాట్లాడారు. అంగన్వాడీ టీచర్ల సమస్యల పరిష్కారా నికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గ్రామాల్లో అందించే సంక్షేమ పథకాలను లబ్ధిదారులు అందేవిధంగా అంగన్వాడీ టీచర్లు కృషిచేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు చీరసారె పెట్టి తోబుట్టవుల మాదిరిగా ఆదరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. కార్యక్ర మంలో ఎంపీపీ కవితారెడ్డి, పీడీ జ్యోతిపద్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొండా సైదయ్య, కాసాని శ్రీనివాస్, సర్పంచ్ నరసింహా రావు, బత్తుల ఉపేందర్, తాజ్, గౌని శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - 2023-02-01T01:52:34+05:30 IST