ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆయిల్‌ ట్యాంకర్‌

ABN, First Publish Date - 2023-02-07T00:11:24+05:30

పనుల కోసం వెళ్తున్న కూలీల ట్రాక్టర్‌ను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొన డంతో 15మంది కూలీ లకు గాయాలయ్యాయి.

ట్యాంకర్‌ ఢీకొట్టడంతో బోల్తాపడిన ట్రాక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

15మంది కూలీలకు గాయాలు

చిట్యాల మండలంలో ఘటన

చిట్యాలరూరల్‌, ఫిబ్రవరి 6: పనుల కోసం వెళ్తున్న కూలీల ట్రాక్టర్‌ను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొన డంతో 15మంది కూలీ లకు గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకా పర్తి గ్రామ శివారులో సోమవారం ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ ఎన్‌. ధర్మా, వాహనదారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిషా, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలకు చెందిన సుమా రు 20మంది కూలీలు గ్రామాల్లో జామాయిల్‌ చెట్లు కొట్టడం, ఇతర పనుల కోసం సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వద్ద పనికి కుదిరారు. చిట్యాల మండల పరిధిలో కూలి పనికోసం ట్రాక్టర్‌లో బయలుదేరారు. ట్రాక్టర్‌ చి ట్యాల వైపు నుంచి పెద్దకాపర్తి శివారుకు వెళ్తోంది. ఈ క్రమంలో హైద రాబాద్‌ నుంచి మిర్యాలగూడకు వెళ్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ ట్రాక్టర్‌ ఇంజ న్‌ను ఢీకొట్టింది. దీంతో ఇంజన్‌, ట్రాలీ చెరో వైపు పడిపోయింది. కూలీలు ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఆ సమయంలో వాహనాల రాకపోకలు తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదాన్ని గమనించిన కొందరు వాహనదారులు 108అంబులెన్స్‌, పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రా మస్థులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయ పడిన కూలీలను ఆంబులెన్స్‌లోకి ఎక్కించారు. పోలీసులు సంఘటనా స్థలా నికి చేరుకొని గాయపడిన 11మంది కూలీలను నార్కట్‌పల్లి శివారులోని కా మినేని ఆస్పత్రికి, నలుగురిని నల్లగొండలోని గొల్లగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.

Updated Date - 2023-02-07T00:11:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising