ఆలేరు వైస్‌ఎంపీపీపై అవిశ్వాసం
ABN, First Publish Date - 2023-07-21T00:44:44+05:30
ఆలేరు మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు గాజుల లావణ్యపై అవిశ్వాసం కోరుతూ మండలానికి చెందిన ఐదుగురు ప్రజా ప్రతినిధులు గురువారం భువనగిరి ఆర్డీవో అమరేందర్‌ను కలిశారు.
ఆలేరు రూరల్, జూలై 20: ఆలేరు మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు గాజుల లావణ్యపై అవిశ్వాసం కోరుతూ మండలానికి చెందిన ఐదుగురు ప్రజా ప్రతినిధులు గురువారం భువనగిరి ఆర్డీవో అమరేందర్‌ను కలిశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మండంలోని ఏడుగురు ఎంపీటీసీలకు గాను ఆరుగురు ఎంపీటీసీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా ఒకే ఒక ఎంపీటీసీ స్థానాన్ని బీఆర్‌ఎస్ గెలుచుకుంది. ఎంపీపీగా కాంగ్రె్‌సకు చెందిన గంధమల్ల అశోక్, వైస్ ఎంపీపీగా కాంగ్రె్‌సకు చెందిన గాజుల లావణ్యను ఎన్నుకున్నారు. రాజకీయ పరిణామాల దృష్ట్యా వైస్‌ఎంపీపీ గాజుల లావణ్య అధికార పార్టీలో చేరడంతో ఎంపీటీసీల మధ్య రాజకీయ ముసలం నెలకొంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజార్టీ ఎంపీటీసీలు అయిన ఐదుగురు ఆమెపై అవిశ్వాస తీర్మాణం కోరుతూ ఆర్డీవోను కలిశారు. ఆర్డీవోను కలిసిన వారిలో ఎంపీపీ గంధమల్ల అశోక్‌తో పాటు కొలనుపాక ఎంపీటీసీ సొంటెం కవిత, శారాజీపేట ఎంపీటీసీ బత్తుల నరేందర్‌రెడ్డి, పటేల్‌గూడెం ఎంపీటీసీ ఆరె ప్రశాంత్, గొలనుకొండ ఎంపీటీసీ బైరపాక లక్ష్మీ ఉన్నారు. కాగా మిగతా ఇద్దరు ఎంపీటీసీల్లో టంగుటూరు ఎంపీటీసీ జే.అనురాధ, కొల్లూరు ఎంపీటీసీ గాజుల లావణ్య బీఆర్‌ఎస్ ఉన్నారు.
Updated Date - 2023-07-21T00:44:44+05:30 IST