ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయులంతా పీఆర్‌టీయూటీఎస్‌ వైపే

ABN, First Publish Date - 2023-05-04T00:28:44+05:30

ఉపాధ్యాయులు పీఆర్‌టీయూటీఎస్‌ వైపే ఉన్నా రని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు.

అభివాదం చేస్తున్న పీఆర్‌టీయూటీఎస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ, మే 3: ఉపాధ్యాయులు పీఆర్‌టీయూటీఎస్‌ వైపే ఉన్నా రని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. జిల్లాకేం ద్రంలో బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. రెండు నెలల్లో సీఎంతో చర్చించి నూతన పీఆర్సీ కమిటీ నియమించేందుకు కృషి చేస్తామన్నారు. ఉద్యోగులకు నగదు రహిత చికిత్సను అందించేందుకు హెల్త్‌ స్కీంను త్వరలోనే ప్రభుత్వం ప్రకటించనుందన్నారు. మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల ప్రమోషన్లు, కేజీబీవీ ఉపాధ్యాయులకు మిని మం టైం స్కేల్‌ వర్తించే విధంగా ఉత్తర్వులు సాధిస్తామన్నారు. సం ఘంలో రెండు దశాబ్దాలు పదవులు అనుభవించిన వ్యక్తి సంఘానికి వెన్నుపోటు పొడిచేలా వ్యవహరించారన్నారు. 2019లో సంఘ కార్య క్రమాలను తన సొంత కార్యక్రమాలుగా ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెళ్లి కమలాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, ఎమ్మెల్సీ కూర రఘు మోత్తంరెడ్డి, గుర్రం చెన్నకేశవరెడ్డి, కాలం నారాయణరెడ్డి, మంత్రవాది శ్రవణ్‌కుమార్‌, ఓరుగంటి శ్రీనివాసులు, ధీరావత్‌ నర్సింహానాయక్‌, భానూతల వెంకట్‌రెడ్డి, గొర్రె సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మేకల జానారెడ్డి, తరాల పరమేష్‌ యాదవ్‌, బాలాజీ, చంద్రశేఖర్‌, రమేష్‌రెడ్డి పాల్గొన్నారు. సంఘంం జిల్లా అధ్య క్షుడిగా తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తున్న డీవీఎస్‌ ఫణికుమార్‌ను పూర్తిస్థాయి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Updated Date - 2023-05-04T00:28:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising