ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్యాక్రాంతమైన మున్సిపల్‌ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి

ABN, First Publish Date - 2023-05-25T00:31:30+05:30

పట్టణ పరిధిలోని శ్రీమిత్ర టౌన్‌షిప్‌ లోని సాయిసౌధ వెంచర్‌లోని మున్సిపల్‌కు కేటాయించిన ఏడు వేల చదరపు గజాల ఖాళీ స్థలాన్ని అక్రమంగా ప్లాట్లు చేసి క్రయ విక్రయాలు జరిపి అన్యాక్రాంతమైన స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఖాళీస్థలాన్ని పరిశీలిస్తున్న డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూదాన్‌పోచంపల్లి, మే 24 : పట్టణ పరిధిలోని శ్రీమిత్ర టౌన్‌షిప్‌ లోని సాయిసౌధ వెంచర్‌లోని మున్సిపల్‌కు కేటాయించిన ఏడు వేల చదరపు గజాల ఖాళీ స్థలాన్ని అక్రమంగా ప్లాట్లు చేసి క్రయ విక్రయాలు జరిపి అన్యాక్రాంతమైన స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. భూదాన్‌పోచంపల్లిలోని శ్రీమిత్ర వెంచర్‌లో గతంలో గ్రామపంచాయతీకి 10 శాతం నాలా కింద వెంచర్‌ యాజమాన్యం రిజిస్ట్రేషన్‌ చేసిన ఖాళీ స్థలాన్ని బీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధి అక్రమంగా రిజిస్ట్రేషన్‌లు చేయించి అన్యాక్రాంతానికి గురి చేశాడని, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌కు కూతవేటులోని ఈ వెంచర్‌లోని ప్రభుత్వ స్థలాన్ని స్వార్థం కోసం ఇతరులకు దారాదత్తం చేయడం సబబు కాదన్నారు. వారం రోజులుగా ఇక్కడ కోట్ల రూపాయల స్కాం జరుగుతుందని ఆందోళనలు జరుగుతున్నా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇదే కాకుండా మరో 5 ఎకరాల స్థలాన్ని ఇతరులకు అప్పగించారని, ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన మున్సిపల్‌ పాలకపక్షం ఏకంగా అక్రమాలకు పాల్పడడం తగదని హితవు పలికారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తడక వెంకటేష్‌, మండల అధ్యక్షుడు పాక మల్లేష్‌యాదవ్‌, నాయకులు భారత లవకుమార్‌, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ సామ మోహన్‌రెడ్డి, గునిగంటి రమేష్‌గౌడ్‌, కళ్లెం రాఘవరెడ్డి, మోటె రాజు, బోగ విష్ణు, గుండు ఉప్పలయ్య, రావుల అనిల్‌, బిట్ల గణేష్‌, సూరపల్లి రాము, రుద్ర చంద్రప్రకాష్‌, గునిగంటి వెంకటేష్‌గౌడ్‌, కుక్కకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-05-25T00:31:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising