ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఎంఏలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

ABN, First Publish Date - 2023-06-03T01:00:50+05:30

పట్టణంలోని సాంఘిక సంక్షేమ సైనిక శిక్షణ మహిళా డిగ్రీ కళాశాలలో ఐదేళ్ల (ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (ఎకనామిక్స్‌))లో చేరదలచుకున్న విద్యార్థుల ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ పాండురంగ శర్మ శుక్రవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీబీనగర్‌, జూన్‌ 2: పట్టణంలోని సాంఘిక సంక్షేమ సైనిక శిక్షణ మహిళా డిగ్రీ కళాశాలలో ఐదేళ్ల (ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (ఎకనామిక్స్‌))లో చేరదలచుకున్న విద్యార్థుల ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ పాండురంగ శర్మ శుక్రవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌లో ఏ గ్రూప్‌లో చదివిన వారైనా ఈ కోర్సుకు అప్లై చేసుకోవచ్చని, ఈ కోర్సుతో పాటు ఆర్మీలోని త్రివిధ తళాలలో ఆఫీసర్లుగా చేరడానికి అవసరమైన శారీరక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా సబ్‌ ఇన్స్‌పెక్టర్‌, సివిల్‌ సర్వీస్‌ తదితర పరీక్షల్లో పాల్గొనడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కళాశాలలో ఎన్‌సీసీ విభాగం కూడా ఉందని, విద్యార్థులు డిగ్రీతో పాటు ఎన్‌సీసీ సర్టిఫికెట్లు పొందుతారని, ఇక్కడి విద్యార్థులు క్రీడల్లో, పర్వతారోహణ మొదలైన వివిధ రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ చదివిన విద్యార్ధులు ఉన్నత విద్యకు అవసరం అయిన సామర్థ్యాన్ని శిక్షణను పొందగలుగుతారని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్ధులు ఠీఠీఠీ.్టటఠీట్ఛజీట.్చఛి.జీుఽ వెబ్‌సైట్‌ ద్వారా జూన్‌ 12లోగా దరఖాస్తు చేసుకోవచ్చునని, జూన్‌ 18న రాత పరీక్ష ఉంటుందని, జూన్‌ 14 నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని ప్రిన్సిపాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2023-06-03T01:00:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising