ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని చేతిలో వ్యవస్థలు దుర్వినియోగం

ABN, First Publish Date - 2023-05-26T00:58:58+05:30

దేశ ప్రధాని వ్యవస్థలను దుర్వినియోగం చేసి అనుయాయులకు, కార్పొరేట్‌ కంపెనీలకు, దత్తపుత్రులకు దోచిపెడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.

సభలో మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ

మేళ్లచెర్వు, మే 25 : దేశ ప్రధాని వ్యవస్థలను దుర్వినియోగం చేసి అనుయాయులకు, కార్పొరేట్‌ కంపెనీలకు, దత్తపుత్రులకు దోచిపెడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. గురువారం చింతలపాలెం మండలకేంద్రం లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధు డు ఉస్తెల వీరారెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వీరారెడ్డి విగ్రహా న్ని నారాయణ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పా టు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడా రు. సాయుధపోరాటంలో పాల్గొని నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీలకు మూడు వేల ఎకరాల పోడుభూములకు వీరారెడ్డి పట్టాలు ఇప్పించారని,ఈ క్రమంలోనే అనేకమార్లు జైలు జీవితం అనుభవించారన్నారు. జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేయడమే కాకుండా తన పార్థివదేహంతో పాటు భార్య పార్థివదేహాన్ని హైదరాబాద్‌లోని మెడికల్‌ కళాశాలకు అందించిన మహోన్నత వ్యక్తి వీరారెడ్డి అన్నా రు. అటువంటి గొప్ప వ్యక్తి విగ్రహావిష్కరణ తన చేతుల మీదుగా జరగడం తన అదృష్టమన్నారు. మోదీ ప్రధాని అయిన తరువాత 28 మంది బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారని, అలా పారిపోయిన వారిలో విజయ్‌ మా ల్యా మినహా మిగతా వారంతా గుజరాత రాష్ర్టానికి చెందిన వారేనన్నారు. భార్యాపిల్లలు లేని మోదీకి 30 మంది దత్తపుత్రులున్నారని, వీరు కాక అదానీ, ఆంధ్రప్రదేశ అవినీతి సీఎం జగనమోహన ఉన్నారన్నారు. పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవంలో ప్రతిపక్షాలన్నీ ఏకమైనా కేసీఆర్‌ నుంచి మాత్రం స్పష్టత లేదని, కేంద్రం విషయంలో బీఆర్‌ఎస్‌ వైఖరి ఏంటో కేసీఆర్‌ ఖచ్చితంగా చెప్పాలని నారాయణ అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రజలు ఉన్నంత వరకు, ప్రజా సమస్యలు ఉన్నంత వరకు కమ్యూనిస్టు పార్టీలు ఉంటాయన్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంతమంది ప్రలోభాలకు గురిచేసినా వీరారెడ్డి కుటుంబమంతా పార్టీకే అంకితమైందన్నారు.

విలువలకు, సిద్ధాంతాలకు కట్టుబడిన సీపీఐ: ఎంపీ ఉత్తమ్‌

విలువలకు, సిద్ధాంతాలకు కట్టుబడిన పార్టీ సీపీఐ అని నల్లగొండ పార్లమెంట్‌ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వీరారెడ్డితో 30 ఏళ్ళుగా అనుబంధం ఉందని, తాను ఏ పదవిలో ఉన్నా వీరారెడ్డి తీసుకువచ్చిన ప్రజా సమస్యలపై స్పం దించి పరిష్కారం చూపానన్నారు. కమ్యూనిస్టు పార్టీ అంటే తనకు వ్యక్తిగతంగా అభిమానమన్నా రు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంట నే గ్రామాల్లో చేసే అభివృద్ధి పనులకు వీరారెడ్డి పే రు పెడతామన్నారు. కార్యక్రమంలో సీపీఐ జాతీ య కమిటీ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర సహాయకార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్‌, రాష్ట్ర కార్యదర్శి పశ్య పద్మ, సీనియర్‌ నాయకులు దొడ్డా నారాయణరా వు, రాష్ట్ర మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఉస్తెల సృజన, నాయకులు ఉస్తెల నారాయణరెడ్డి, బొమ్మగాని ప్రభాకర్‌, బెజవాడ వెంకటేశ్వర్లు, కంబాల శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T00:58:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising