ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈతకు వెళ్లి యువకుడు మృతి

ABN, First Publish Date - 2023-06-11T00:45:00+05:30

ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో శనివారం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతపల్లి, జూన్‌ 10: ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సతీ్‌షరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... డిండి మండలం బొగ్గులదొన గ్రామానికి చెందిన వేముల వెంకటయ్య సువర్ణ దంపతులకు ఐదుగురు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడైన రాజు(18) ఎనిమిదో తరగతి వరకు చదివి కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారం రోజుల క్రితం చింతపల్లి మండల కేంద్రంలోని తన మేనమామ కొమెర తిరుపతయ్య ఇంటికి వచ్చాడు. శనివారం తన మేనమామ కుమారుడైన శివతో కలిసి చింతపల్లి మండలకేంద్రం సమీపంలోని ఇదంబాయికి ఈతకు వెళ్లారు. బావిలోకి దూకిన రాజు నీరు మింగి బావిలో మునిగిపోయాడు. రాజు కనపడకపోవడంతో భయాందోళనకు గురైన శివ తన తండ్రికి సమాచారం అందించాడు. వెంటనే తిరుపతయ్యతో పాటు కుటుంబ సభ్యులు బావి వద్దకు చేరుకున్నారు. ఈత వచ్చిన వారితో బావిలో వెతికించగా రాజు మృతదేహాన్ని బయటకు తీశారు. సమాచారాన్ని తిరుపతయ్య చింతపల్లి పోలీసులకు, తన బావ వేముల వెంకటయ్యకు అందజేశాడు. ఎస్‌ఐ సతీ్‌షరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తన కుమారుడు రాజు నడుమునొప్పితో బాధపడుతుండటంతో నాటువైద్యం చేయిస్తున్నామని, ఆ ఇబ్బందితోనే ఈత కొట్టలేక బావిలో మునిగి మృతిచెందాడని పోలీసులకు అతడి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మృతదేహాన్ని దేవరకొండ సివిల్‌ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-06-11T00:45:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising