ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రపంచస్థాయి షాపింగ్‌ అనుభూతి కలుగుతుంది

ABN, First Publish Date - 2023-08-22T01:18:23+05:30

సూర్యాపేటలో ఏర్పా టు చేసిన సీఎంఆర్‌ షాపింగ్‌మాల్‌ ప్రపంచస్థాయి షాపిం గ్‌ అనుభూతిని కలిగిస్తోందని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్‌ షాపింగ్‌మాల్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.

మంత్రి జగదీ్‌షరెడ్డి

సూర్యాపేటటౌన్‌, ఆగస్టు 21: సూర్యాపేటలో ఏర్పా టు చేసిన సీఎంఆర్‌ షాపింగ్‌మాల్‌ ప్రపంచస్థాయి షాపిం గ్‌ అనుభూతిని కలిగిస్తోందని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్‌ షాపింగ్‌మాల్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లా కేంద్రం వ్యాపార కూడలిగా రూపాంత రం చెందుతోందని, ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చి వ్యాపారం చేసుకునే సౌకర్యాలు జిల్లా కేంద్రంలో ఉన్నాయన్నారు. సరికొత్త డిజైన్లతో ప్రజల మన్నలనను పొందేలా సీఎంఆర్‌ షాపింగ్‌మాల్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటుకావడం హర్షనీయమన్నారు. ప్రజల మన్ననలు పొందే లా నాణ్యమైన దుస్తులు విక్రయించాలని సూచించారు. బీ ఆర్‌ఎస్‌ పాలనలో వ్యాపారంరంగం కనీవినీ ఎరుగని రీతి లో దూసుకుపోతోందని, ఇది సీఎం కేసీఆర్‌ దర్శనికతకు నిదర్శనమన్నారు. పట్టణ, చుట్టు పక్కల గ్రామీణ ప్రజలు హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్లకుండా ఇక్కడే నచ్చిన దుస్తు లు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, కౌన్సిలర్‌ కొండపల్లి నిఖిల, బీఆర్‌ఎస్‌ నాయకులు మారిపెద్ది శ్రీనివా్‌సగౌ డ్‌, గండూరి కృపాకర్‌, జ్యోతి కర్ణాకర్‌, బొమ్మగాని శ్రీనివాస్‌, సీఎంఆర్‌ షాపింగ్‌మాల్‌ చైర్మన్‌ మావూరి వెంకటరమణ, డైరెక్టర్‌ మోహన్‌బాలాజీ, ఫరూఖ్‌, రాచర్ల కమలాకర్‌, తెడ్ల పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.

సినీహీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ సందడి

జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్‌ షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవంలో సినీ నటి, ‘సీతారామం’ ఫేమ్‌ మృణాల్‌ఠాకూర్‌ సందడి చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విలేకరులతో ఆమె మాట్లాడుతూ, సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ ఇప్పటికే 23 బ్రాంచ్‌లకు పైగా ఏర్పాటు చేసిందన్నారు.

Updated Date - 2023-08-22T01:18:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising