Talasani Srinivas Yadav : బీజేపీది రాక్షసానందం: తలసాని
ABN, First Publish Date - 2023-03-13T02:26:27+05:30
రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు ఉండవద్దని, ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు బీజేపీ ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలను ఉసిగొల్పి రాక్షసానందం పొందుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
చేర్యాల, మార్చి 12: రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు ఉండవద్దని, ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు బీజేపీ ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలను ఉసిగొల్పి రాక్షసానందం పొందుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయాన్ని ఆదివారం ఆయన సందర్శించి పూజలు నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత పోరాటమే ఊపిరిగా తెలంగాణ ఉద్యమంలో వీరవనితగా పాటుపడిందని కొనియాడారు. మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న క్రమంలో ఈడీ పేరిట విచారణ చేయడం తగదన్నారు. తప్పు చేయకున్నా సీఎం కేసీఆర్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, బీఆర్‌ఎస్ పార్టీని ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కవిత పట్ల బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. మహిళలను ఎవరు కించపరిచినా తప్పేనని, ఎమ్మెల్యే రాజయ్యపై వచ్చిన ఆరోపణలపై పార్టీ విచారణ చేపట్టి తప్పక నిర్ణయం తీసుకుంటుందన్నారు.
Updated Date - 2023-03-13T02:26:27+05:30 IST