ఆ ఇద్దరి వల్లే ఏపీ బొక్కబోర్లా
ABN, First Publish Date - 2023-06-11T03:37:21+05:30
తెలంగాణ మంత్రి హరీశ్‌రావు మరోసారి ఆంధ్రప్రదేశ్‌ను, ఆ రాష్ట్ర నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఇద్దరు
● వాళ్లది ప్రచారం ఎక్కువ.. మనది పని ఎక్కువ
● సుపరిపాలన దినోత్సవంలో మంత్రి హరీశ్
సంగారెడ్డి, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మంత్రి హరీశ్‌రావు మరోసారి ఆంధ్రప్రదేశ్‌ను, ఆ రాష్ట్ర నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఇద్దరు నేతలు వ్యవహరించిన తీరు వల్లే ఆంధ్రప్రదేశ్ బొక్కబోర్లా పడిందన్నారు. గతంలో ఒకరు హైటెక్ పాలన అంటూ హడావిడి చేశారని, ఇప్పుడేమైందని ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం సంగారెడ్డిలో జరిగిన సుపరిపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ‘‘ఏపీ పాలకులది ప్రచారం ఎక్కువ.. మనది పని ఎక్కువ. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి చూస్తే తెలంగాణ గొప్పదనమేంటో తెలుస్తుంది. ఆ రాష్ట్రల్లో రోడ్లు సరిగా లేవు. తాగునీరు కూడా సక్రమంగా అందడం లేదు’’ అని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తలెత్తుకునేలా పాలన సాగిస్తున్నారని కొనియాడారు.
Updated Date - 2023-06-11T03:37:21+05:30 IST