ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వర్గల్‌ విద్యాధరి క్షేత్రం

ABN, First Publish Date - 2023-06-14T00:36:25+05:30

వర్గల్‌, జూన్‌ 13: రాష్ట్రంలో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వర్గల్‌ విద్యాధరి క్షేత్రం విరాజిల్లుతున్నదని, అటువంటి పుణ్యక్షేత్రం మన సిద్దిపేట జిల్లాలో ఉండటం ప్రజలు చేసుకున్న పుణ్యమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.

మంత్రి హరీశ్‌రావుకు విద్యా సరస్వతీ ఆలయ జ్ఞాపికను అందజేస్తున్న స్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు

వర్గల్‌, జూన్‌ 13: రాష్ట్రంలో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వర్గల్‌ విద్యాధరి క్షేత్రం విరాజిల్లుతున్నదని, అటువంటి పుణ్యక్షేత్రం మన సిద్దిపేట జిల్లాలో ఉండటం ప్రజలు చేసుకున్న పుణ్యమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో ఆలయ వ్యవస్థాపకుడు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వంలో జరుగుతున్న కంచి శంకర మఠం, శారదా వైదిక స్మార్త వేద విద్యాలయ ప్రారంభోత్సవ వేడుకల్లో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ముందుగా క్షేత్రంలోని శ్రీశంకర మఠంలో ఉన్న కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం విద్యాధరి క్షేత్రంలోని విద్యా సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యాధరి క్షేత్రం అభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తున్నామన్నారు. విద్యా సరస్వతీ అమ్మవారి దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మను ప్రార్థించినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వేడుకల సందర్భంగా మూడోరోజు విద్యాధరి క్షేత్రంలో కంచి శంకర జయేంద్ర సరస్వతీ స్వామివారి శంకర మఠంలో చంద్రమౌళీశ్వర పూజలు నిర్వహించారు. వేడుకలకు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ అన్న ప్రసాదాలను ఏర్పాటు చేశారు.

వేడుకలలో పాల్గొన్న పలువురు ప్రముఖులు

వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో జరుగుతున్న శంకర మఠం ప్రారంభోత్సవాలలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, దేవీ ఉపాసకుడు దైవజ్ఞశర్మ, మర్పడగ సంతాన మల్లికార్జునస్వామి వ్యవస్థాపకులు హరినాథశర్మ, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి పాల్గొన్నారు.

Updated Date - 2023-06-14T00:36:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising