ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వానొచ్చే.. వరదొచ్చే..

ABN, First Publish Date - 2023-07-21T00:42:29+05:30

కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్‌ మోయతుమ్మెద వాగు ఎగువ నుంచి వచ్చే వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నది.

కోహెడ మండలం బస్వాపూర్‌ వద్ద మునిగిన సిద్దిపేట - హన్మకొండ ప్రధాన రహదారి

జిల్లాలో దంచికొట్టిన వాన

పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు

ఉధృతంగా ప్రవహిస్తున్న మోయతుమ్మెద వాగు

బస్వాపూర్‌ వద్ద మునిగిన సిద్దిపేట - హన్మకొండ ప్రధాన రహదారి

నిలిచిన రాకపోకలు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు

జిల్లాలో ప్రమాదకర రహదారులను మూసేసిన పోలీసులు

పలుచోట్ల కూలిన ఇళ్లు.. చిత్తడిగా మారిన రోడ్లు

ఎక్కడికక్కడ స్తంభించిన జనజీవనం

అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని పోలీసుల హెచ్చరిక

బెజ్జంకి/కోహెడ/రాయపోల్‌/తొగుట/చేర్యాల/కొండపాక/హుస్నాబాద్‌రూరల్‌/ నంగునూరు/వర్గల్‌,జూలై20: కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్‌ మోయతుమ్మెద వాగు ఎగువ నుంచి వచ్చే వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటలు సైతం కురిసిన వర్షానికి మత్తళ్లు దూకుతున్నాయి. కోహెడ మండలం బస్వాపూర్‌ గ్రామ సమీపంలో మోయతుమ్మెద వాగు పొంగి పొర్లుతుంది. కోహెడ మండలం బస్వాపూర్‌ బ్రిడ్జిపై ఉన్న సిద్దిపేట-హన్మకొండ ప్రధాన రహదారి వరదనీటితో మునిగిపోవడంతో రాకపోకలను నిలిపివేశారు. బస్వాపూర్‌, అరెపల్లి వద్ద ఎక్కడి వాహనాలను అక్కడనే నిలిపివేశారు. దూరప్రాంతాలకు వెళ్లే వాహనాలను నంగునూరు మండలం మల్యాల, కోహెడ మండలం పోరెడ్డిపల్లి మీదుగా హుస్నాబాద్‌, హనుమకొండకు వెళ్లే విధంగా అధికారులు దారి మళ్లించారు. మోయ తుమ్మెద వాగు పొంగిపొర్లుతుడడంతో సింగరయ్య ప్రాజెక్టు, శనిగరం మధ్య తరహా ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతున్నది. హుస్నాబాద్‌ డీసీపీ మహేందర్‌ వరద ఉధృతిని పర్యవేక్షించి పోలీసులకు తగు జాగ్రత్తలు, సూచనలు చేశారు. తహసీల్దార్‌ జావిద్‌, రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు వరద ఉధృతిని పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. దౌల్తాబాద్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గేటు వద్ద నీళ్లు నిలవడంతో ఆరోగ్యకేంద్రంలోనికి వెళ్లే రోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. పీహెచ్‌సీ గేటు వద్ద నీళ్లు ఆగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు తొగుట మండలంలో చెరువులు, వాగులు పొంగిపొర్లుతుండడంతో ప్రజలు తరలివచ్చి పూజలు చేస్తున్నారు. కానుగల్‌లోని పెద్ద చెరువు వద్దకు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమురయ్య గంగమ్మకు పూజలు చేశారు. వర్షం మూలంగా పత్తి, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు వరి నాట్లు ముమ్మరం చేశారు. చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో ముసురువర్షం కురిసింది. కొమురవెల్లి మండలం పోసాన్‌పల్లి గ్రామశివారులోని గుండ్ల చెరువు అలుగుపారింది. మల్లన్న ఆలయంలో ముఖమండపం ఊరుస్తూనే ఉంది. చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కత్తుల సాయిరెడ్డి ఇంటిపైకప్పు నేలకూలింది. గుర్జకుంట, ఆకునూరువాగులు ప్రవహిస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండు మొత్తం జలమయమైంది. జనగామ-సిద్దిపేట ప్రధాన రహదారిపై స్థానిక బస్టాండు, అంగడిబజారు తదితర ప్రదేశాలలో ప్రమాదకరంగా గుంతలు ఏర్పడటంతో వాహనచోదకులు తంటాలుపడ్డారు. కొండపాక మండలం దుద్దెడ నల్లచెరువు, మర్పడగ గుండ్ల చెరువు, తిప్పని కుంట తదితర చెరువులు మత్తడి దూకుతున్నాయి. కొండపాక, మర్పడగ చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. పలు గ్రామాల్లో ఇళ్లకు స్వల్ప నష్టం వాటిల్లింది. సిరసనగండ్లలో రెండు, బందారంలో ఒకటి, ఖమ్మంపల్లిలో ఒక ఇల్లు పాక్షికంగా కూలాయి. హుస్నాబాద్‌ మండలంలోని పందిల్ల గ్రామంలో పూజారి రాజయ్య, తాడూరి కనకవ్వ, తాడూరి లింగానికి చెందిన ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని సర్పంచ్‌ రమేష్‌ తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లారు. దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వం నుంచి పరిహారం అందజేయాలని కోరారు. నంగునూరు మండలంలోని చెరువులు, కుంటలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. పెద్దవాగు పొంగిపొర్లడంతో వాగు అవతలి గ్రామాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఘనపురం నంగునూరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం నుంచి మత్తడి దూకుతుండడంతో ఆ దారి వెంట అలర్ట్‌ ప్రకటించారు. రాజగోపాల్‌పేట ఎస్‌ఐ రాజుగౌడ్‌ ఆధ్వర్యంలో సిబ్బంది పహారా కాస్తున్నారు. ఖాతా, జాలపల్లి మధ్యవాగు, అక్కెనపల్లి, పోరెడ్డిపల్లి మధ్యలో వాగు ప్రవహి స్తుండటంతో అక్కడి దారిని కూడా మూసివేసి సిబ్బందిని అప్రమత్తం చేశారు. మండలంలోని ఖాతా ఘనపురం నంగునూర్‌ అక్కనపల్లి పెద్దవాగు నిండుకుండల మారి రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్నది. వర్షాలతో కూరగాయల పంటలు సైతం దెబ్బతిన్నాయి. పోలీసులు రెవెన్యూ అధికారులు పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నంగునూరు బస్టాండ్‌ నుంచి వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లే రోడ్డు బురదమయంగా మారింది. మంత్రి హరీశ్‌రావు కృషితో ప్రధాన వీధుల్లో సీసీ రోడ్లు వేశారు. కానీ బస్టాండ్‌కు వెళ్లే గ్రామానికి నిధులు కేటాయించకపోవడంతో పనులు చేపట్టలేదు. దీంతో ఆలయానికి వెళ్లే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.

కూలిన పంచాయతీ కార్యాలయ భవనం

పెంకుటింట్లో కొనసాగుతున్న వర్గల్‌ మండలం జెబ్బాపూర్‌ గ్రామపంచాయతీ కార్యాలయం గురువారం కూలింది. గ్రామానికి సంబంధించిన రికార్డులతో పాటు ఫర్నీచర్‌ సామగ్రి దెబ్బతిన్నది. సొంత భవనం లేకపోవడంతో తాత్కాలికంగా అద్దెచెల్లిస్లూ పెంకుటిల్లులో కొనసాగిస్తున్నారు. కూలిన సమయంలో పంచాయతీ కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదని సర్పంచ్‌ నర్సమ్మ తెలిపారు. నూతన పంచాయతీ భవనం కోసం రూ.4లక్షలు సొంత డబ్బు వెచ్చించి స్థలం కొనుగోలు చేసి ప్రభుత్వానికి అప్పగించామని తెలిపారు. నిధులు సరిపోక పనులు మధ్యలోనే ఆగిపోయాయని, ఈ విషయాన్ని ‘గడ’ అధికారి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఇప్పటికే 75శాతం నిర్మాణం పూర్తయిందని, నిధులు మంజూరైతే నిర్మాణం పూర్తిచేసి అందులోకి మారుతామని తెలిపారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

సిద్దిపేటక్రైం జూలై 20: జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శ్వేత ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా పలు సూచనలు అందజేశారు.

ప్రతి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల నీటి ప్రవాహం గురించి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రత్యక్షంగా వెళ్లి పర్యవేక్షించాలని, సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులతో సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు.

జిల్లాలో ఎక్కడైనా వరద ఉధృతితో రోడ్లు తెగిపోయిన, ఉధృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లకూడదని, రెండు దిక్కులా ప్లాస్టిక్‌ కోన్స్‌, రోడ్‌ టాపర్స్‌ మరియు తాడు మరే ఇతర పరికరాలను అడ్డుగా పెట్టి సంబంధిత గ్రామాల సర్పంచులకు, ప్రజలకు తెలియజేయాలనిసూచించారు.

సర్పంచులతో ఎప్పటికప్పుడు వరద ఉధృతి గురించి తెలుసుకోవాలన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో పోలీస్‌ అధికారులు, సిబ్బంది, హెడ్క్వార్టర్‌ వదిలి వెళ్లవద్దని తెలిపారు.

24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు.

పట్టణాల్లో, గ్రామాల్లో మట్టితో కట్టిన పురాతన ఇళ్ల గురించి సమాచారం తెలుసుకోవాలన్నారు. ఇళ్లు కూలే ప్రమాదం ఉంటే సంబంధిత మున్సిపల్‌, రెవెన్యూ అధికారుల సహకారంతో వారిని సుర క్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.

వరద ఉధృతి ఎక్కువ ఉన్న ప్రదేశాలలో ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్‌ డైవర్షన్‌ చేయాలని సూచించారు.

రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ప్రజలు కూడా అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఏదైనా విపత్కర సమస్య వస్తే డయల్‌ 100, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ 8712667100 నంబర్‌కు సమాచారం అందిస్తే సహాయక రక్షణ చర్యలు చేపడుతామని సీపీ తెలిపారు.

ప్రజలు పోలీసుల సూచనలు సలహాలు పాటించాలి. వాగులు, రోడ్లు, బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న నీటి ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేయకూడదు.

పొంగుతున్నచెరువులు, వాగులు, బ్రిడ్జిల వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగొద్దు.

పిల్లలు బయటకు వెళ్లేప్పుడు తల్లిదండ్రులు తప్పకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి

సిద్దిపేట - వరంగల్‌ వెళ్లే రోడ్డులో కోహెడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మోయతుమ్మెద వాగు బ్రిడ్జిపై నుంచి నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు, వాహనదారులు ఎవ్వరు వెళ్లకుండా ఎలాంటి ప్రమాదం జరగకుండా రెండు వైపులా స్టాపర్స్‌ పెట్టి పోలీస్‌ సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

సిద్దిపేట వైపు నుంచి వరంగల్‌ వెళ్లే వాహనదారులు బస్వాపూర్‌ గ్రామం నుండి పోరెడ్డిపల్లి, లక్ష్మాపూర్‌ మీదుగా వరంగల్‌కు వెళ్లాలి.

వరంగల్‌ నుంచి సిద్దిపేటకు వచ్చే వాహనదారులు లక్ష్మాపూర్‌, పోరెడ్డిపల్లి, బస్వాపూర్‌ గ్రామాల మీదుగా సిద్దిపేటకు రావాలి.

Updated Date - 2023-07-21T00:43:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising